విలక్షణ నటుయుడు జగపతి బాబు వివాదాలకు దూరంగా ఉంటాడు. అయితే అతడు అనుకోకుండా చేసిన కామెంట్స్ మెగా అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగించినట్లు వార్తలు వస్తున్నాయి.  నిన్నటి ‘సైరా’ ఈవెంట్ లో మాట్లాడే అతిధులు ఎక్కువ అయిపోవడంతో పాటు కార్యక్రమం మధ్యలో వాన హడావిడి ప్రారంభం కావడంతో  చిరంజీవి సూచనతో ఆ కార్యక్రమం వేగం పెంచారు.  

దీనితో ఆ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులను తక్కువగా మాట్లాడమని సూచనలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితులలో మైక్ తీసుకున్న జగపతి బాబు చేసిన ప్రయోగం వికటించి మెగా అభిమానులకు అసహనాన్ని కలిగించినట్లు తెలుస్తోంది. జగపతి బాబు తన ఉపన్యాస ప్రారంభంలో ‘మెగాస్టార్, పవర్ స్టార్, ఆల్ కైండ్ ఆఫ్ గిగా స్టార్స్ ఆన్ ది స్టేజ్' అంటూ ప్రసంగం ప్రారంభించాడు. 

హడావుడిగా ఆయన అన్న ఆమాటలను కొంతమంది మెగా ఫ్యాన్స్ క్యాచ్ చేయడంతో జగపతి బాబుకు అంత ఇగో ఏమిటి అంటూ కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ ఈవెంట్ లో అనుకోకుండా అన్న జగపతి బాబు మాట 'ఆల్ కైండ్ ఆఫ్ గిగా స్టార్స్' అనే పదాన్ని పట్టుకుని కొంతమంది సెటైర్స్ వేస్తూ మెగా ఫ్యామిలీ హీరోల బిరుదులను టార్గెట్ చేస్తున్నారు.

దీనితో ఈ అనవసరపు బురదలోకి జగపతి బాబు పేరును వాడటం ఆశ్చర్యంగా మారింది. సాధారణంగా హడావిడిలో మాట్లాడుతున్నప్పుడు ఒక పదానికి బదులు మరొక పదం నోటివెంట వస్తూ ఉంటుంది. అయితే పబ్లిక్ మీటింగ్స్ లో ఎవరు ఏమి తప్పు చేస్తారు అంటూ విశ్లేషణలు చేసే వ్యక్తులు సోషల్ మీడియాలో ఎక్కువై పోవడంతో యధాలాపంగా జగపతి బాబు అన్న మాటల పై ఇప్పుడు రచ్చ జరుగుతోంది. అందుకే మెగా అభిమానులను తట్టుకుని నిలబడటం కష్టం అంటూ కొందరు జోక్స్ కూడ వేస్తూ ఉంటారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: