ఆదివారం బిగ్ బాస్3 ఎపిసోడ్కి తన సినిమా ప్రమోషన్స్‌ కోసం గద్దలకొండ గణేష్  హీరో వరుణ్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం వరుణ్ తేజ్ సంచలనాలు కొనసాగుతున్నాయి.సినిమా హిట్ కావడంతో  వరుణ్ తేజ్  సంతోషం అంత ఇంత కాదు.సినిమా కలెక్షన్ విషయంలో జోరుగా దూసుకుపోతుంది మూడవ రోజు కూడా. హౌస్ లో ఉన్న వారితో మరియు నాగార్జునతో సరదాగా కాసేపు గడిపారు.

ముఖ్యంగా ఇంట్లో ఉన్న వాళ్లతో సినిమా గురించి తెలియచేసారు. సినిమా విడుదల 8  గంటల ముందు వాల్మీకి గా ఉన్న సినిమా పేరు ను  గద్దలకొండ గణేష్ గా మర్చి రిలీజ్ చేశారు అని నాగ్ హౌస్ కాంటెస్ట్తో చెప్పారు.గద్దలకొండ గణేష్‌గా వచ్చాడు కాబట్టి తెలంగాణ యాసలోనే అందరికీ హాయ్ చెప్పి హౌస్ లో ఉన్న వారితో మాట్లాడరు.

గద్దలకొండ గణేష్ రాకతో ఒక్క సరిగా  ఇంట్లో ఉన్న హౌజ్ మేట్స్ కూడా మాస్ అయిపోయారు. ఇక నాగార్జున గారు ఇంట్లో ఉన్న లేడీస్  వరుణ్ కి ప్రపోజ్ చేయాలి అని చెప్పారు.
శివ జ్యోతి అక్క మాత్రం తన డైన స్టైల్ లో వరుణ్ కి  ప్రపోజ్ చేసింది. వరుణ్ కూడా చాల బాగా నచ్చింది.

చివరికి పునర్నవి మాత్రం ఎట్టకేలకు తపించుకుంది. మరోవైపు శ్రీముఖి, హిమజ మన గద్దలకొండ గణేష్‌కు ప్రపోజ్ కూడా చేసారు.  ఈ వారం బిగ్ బాస్ ఇంట్లో గద్దలకొండ గణేష్ రచ్చ మామూలుగా లేదు.లాస్ట్ లో వరుణ్ తేజ్ ఇంట్లో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో ప్రకటించి వెళ్లిపోయారు.అందిరికి బాయ్ చెప్తూ అందరు బయటికి వచ్చాక ఒక మంచి దావతు ఇస్తానని  చెప్పి వెళ్లిపోయారు.


    మరింత సమాచారం తెలుసుకోండి: