గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన విడుదల కానున్న సైరా నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు చాలా రిలీజ్ ఫంక్షన్ లో తెలియజేశారు. ఈ చిత్రానికి సంబంధించి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, రాజమౌళి, జగపతి బాబు తదితరులు మాట్లాడినా చిరంజీవి మాట్లాడిన మాటలు మెగా అభిమానులు మరియు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్నాయి. ఆయన సైరా చిత్రానికి సంబంధించి ఎన్నో తెలియని విషయాలను ఈ సందర్భంగా బయటకు చెప్పాడు. 

మొదట దాదాపు రెండు దశాబ్దాలు పరుచూరి సోదరులు ఈ చిత్రం యొక్క కథను తమ గుండెల పై మోస్తూ వచ్చారని... చివరికి వారి కోరికను తన కొడుకు రామ్ చరణ్ తనని హీరోగా పెట్టి తీస్తూ వారి కలను నెరవేరుస్తున్నాడని చిరంజీవి అన్నాడు. అయితే ఈ సందర్భంగా చిరంజీవి గుర్తు చేసుకున్న విషయం ఏమిటంటే మొదట పరుచూరి వెంకటేశ్వర్లు చిరంజీవిని హీరోగా నటిస్తూ డైరెక్షన్ కూడా చేయమని సలహా ఇచ్చాడట. అందుకు మొదట చాలా ఆనందపడిన చిరంజీవి తర్వాత ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకి దర్శకత్వం వహించే అవకాశం వచ్చినందుకు తనకి చాలా ఆనందంగా ఉన్నా అటు హీరోగా.... ఇటు దర్శకుడిగా ఉంటూ తాను పూర్తి న్యాయం చేయలేనని భావించినట్లు చిరంజీవి చెప్పాడు. తాను దర్శకత్వం చేయలేక కాదని.... చేస్తే ఒకటి హీరోగా అయినా చేస్తానని లేదా కేవలం డైరెక్టర్ గా మిగిలిపోతాను అని చెప్పగా అందరు అతనిని మిమ్మల్ని తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేను అని చెప్పడంతో, మంచి దర్శకుల కోసం వెతుకుతుండగా రామ్ చరణ్ సురేందర్ రెడ్డి పేరు వెల్లడించినట్లు కూడా చిరంజీవి ఈ సందర్భంగా తెలిపాడు. ఏదైనా మెగా స్టార్ మెగా ఫోన్ పట్టుకునే చాన్స్ మనందరం మిస్సయ్యాం.


మరింత సమాచారం తెలుసుకోండి: