బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి చేస్తున్నారు. సినిమాలో ఒక హీరోయిన్ గా అలియా భట్ నటిస్తుండగా మరో హీరోయిన్ ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఎప్పుడూ లేనిది రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ ను ముందే ప్రకటించాడు.


2020 జూలై 30న ఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే ఈ డేట్ కు సినిమా రావడం కష్టమని ఫిల్మ్ నగర్ ఇన్ సైడ్ టాక్. వరుసగా ఎన్.టి.ఆర్, రాం చరణ్ లకు గాయాలవడంతో సినిమా ముహుర్తం తర్వాత కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. 400 కోట్ల భారీ బడ్జెట్ తో చేస్తున్న సినిమా కాబట్టి హడావిడిగా కానివ్వడం కరెక్ట్ కాదు.        


అందుకే ట్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్ మార్చే ఆలోచనలో ఉన్నారట. సినిమా అనుకున్నప్పుడు జనవరి కల్లా షూటింగ్ పూర్తి చేసి జూన్ కల్లా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి జూలై రిలీజ్ అనుకున్నారు. కాని ఇప్పుడు సినిమా షూటింగే మే నెల దాకా పట్టేలా ఉందట. సో ఎలా లేదన్నా కనీసం నాలుగు నెలలు వి.ఎఫ్.ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ లాంటి పనులు చేయాల్సి ఉంటుంది. అసలే తనకు కావాల్సిన అవుట్ పుట్ వచ్చేంత వరకు రాజమౌళి ఊరుకోడు.


మరి రాజమౌళి షూటింగ్ స్పీడప్ చేసి అనుకున్న టైం కు రిలీజ్ చేస్తాడా లేక సినిమా క్వాలిటీ మీద దృష్టి పెట్టి వాయిదా వేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. సినిమాలో రాం చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. కొమరం భీం పాత్రలో ఎన్.టి.ఆర్ కనిపించనున్నాడు. ఈమధ్యనే బల్గేరియాలో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాకు సంబందించిన ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్ అక్టోబర్ 22న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: