స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్  విక్రమ్ కుమార్  దర్శకత్వంలో  నేచురల్ స్టార్  నాని కథానాయకుడిగా  తెరకెక్కిన సినిమా 'గ్యాంగ్ లీడర్'.  రివేంజ్ డ్రామాతో సాగే కామెడీ ఎంటర్ టైనర్ గా  వచ్చిన  ఈ  చిత్రం మంచి  ఏవరేజ్ టాక్ తో  బాక్స్ ఆఫీస్ వద్ద  ఏవరేజ్  చిత్రంగా నిలిచింది. అయితే యూఎస్ లో  మాత్రం 'గ్యాంగ్ లీడర్' ఒక్కసారిగా పడిపోయాడు. యూఎస్ లో ఈ సినిమా  మొత్తం 177 లొకేషన్స్  లోని  ప్రీమియర్ షోల నుండి $182,679 డాలర్స్ సాధించింది.  ఆ తరువాత కూడా మొదటి వారాంతానికి 630,860 డాలర్లను ఖాతాలో వేసుకుంది.  ఇక ఐదు రోజులకే ఆ కలెక్షన్స్ 821,607కు చేరడంతో సులభంగానే మిలియన్ మార్క్ చేరుకుంటుందని అంతా అనుకున్నారు.   కానీ పరిస్తితి పూర్తిగా తారుమారైంది.  బుధవారం నుండి సినిమా వసూళ్లు బాగా తగ్గాయి.  మధ్యలో 'గద్దలకొండ గణేష్' విడుదల కావడంతో  వసూళ్ల మీద మరింత ప్రభావాన్ని చూపింది.  దీంతో రెండవ వీకెండ్ ముగిసే నాటికి ఈ చిత్రం 915,900 డాలర్లకే పరిమితమైంది.  దీన్నిబట్టి  ఈ చిత్రం మిలియన్ మార్కును అందుకోవడం అసాధ్యమనిపిస్తోంది. మొత్తానికి 'గద్దలకొండ గణేష్',   'గ్యాంగ్ లీడర్'ని ముంచేశాడు.  పర్ఫెక్ట్ హిట్ కోసం నాని ఎంచుకున్న ఈ  'గ్యాంగ్ లీడర్' రివేంజ్ కామెడీ డ్రామాగా సాగుతూ కొంతవరకూ  ఆకట్టుకున్నా.. యూఎస్ లో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు.  అయితే  సినిమాలో  లక్ష్మీ, శరణ్య, ప్రియాంక తదితరులతో కూడిన గ్యాంగ్‌ తో నాని చేసిన సీన్స్‌  చాలా ఎంటర్‌టైనింగ్‌ గా సాగాయని, అలాగే క్లైమాక్స్ లో నాని, కార్తికేయతో చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా  ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని..  ఇక మ్యూజిక్ సంచలనం  అనిరుధ్ ఈ సినిమాకి  అందించిన సంగీతం మరియు  హీరోహీరోయిన్లు మధ్య కెమిస్ట్రీ  బాగా ఆకట్టుకున్నాయని..  యూఎస్ ఆడియన్స్ చెబుతున్నారట. 


కానీ, సినిమాని మాత్రం వాళ్ళు ఆదరించడం లేదు. ఇక  పెన్సల్ పార్ధ సారథి అనే పాత్రలో నాని  తన పాత్రకు తగ్గట్లు... తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ  సినిమాకే  హైలెట్ గా నిలిచాడు.  ఏమైనా  ఎంటర్టైన్మెంట్ జానర్ నానికి బాగా  కలిసొచ్చే అంశం అనుకుంటే..  ఈ సినిమా నిరాశ పరిచింది. మరి  ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన  చెన్నై బ్యూటీ  ప్రియాంకా అరుళ్ మోహన్ ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంతవరకూ నెట్టుకొస్తోందో చూడలి.  అలాగే ఇటీవలే గుణ అంటూ మరో ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్న  'ఆర్ఎక్స్ 100' హీరో  కార్తికేయ నెగిటివ్ రోల్ లో తేలిపోయాడు.  అయితే ఇతర కీలక పాత్రల్లో  వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రఘుబాబు, సత్య  చాల బాగా నటించారు.  మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్  అనిరుధ్ మ్యూజిక్ అందించారు.     

 


మరింత సమాచారం తెలుసుకోండి: