బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు సోమవారం వస్తే నామినేషన్ ప్రక్రియ ఉంటుందని తెలిసిందే. ఈరోజు ఎపిసోడ్ లో శనివారం ఫేక్ ఎలిమినేషన్ అయ్యి బిగ్ బాస్ స్పెషల్ రూంలో ఉన్న రాహుల్ ఇంట్లో వచ్చాడు. రాహుల్ రావడం గేమ్ మరింత ఆసక్తికరంగా మారింది. రాహుల్ నిజంగానే వెళ్లిపోయాడని శ్రీముఖి అతని మీద కామెంట్స్ చేసింది.    


ఇక సోమవారం నామినేషన్ ప్రక్రియలో ఉన్న 9 మంది ఇంటి సభ్యులలో ఇద్దరు కలిసి నాలుగు జంటలుగా ఏర్పడాల్సి ఉంటుంది. కెప్టెన్ అయిన మహేష్ ఈవారం నామినేషన్స్ నుండి తప్పించుకున్నాడు. ఇక శ్రీముఖి, శివ జ్యోతి మొదటి జంటగా నామినేషన్స్ లో పాల్గొనగా ఇద్దరి మధ్య ఎవరు బెస్ట్ అన్న వాగ్వివాదం జరిగింది. అందులో ఇంట్లో ఉన్న మిగతా ఏడుగురు సభ్యులలో నలుగురు శివ జ్యోతికి ముగ్గురు శ్రీముఖికి ఓటు వేయడంతో ఈ వారం మొదటి నామినేషన్ శ్రీముఖి నిలిచింది.   


తర్వాత రవి కృష్ణ, వితికలో రవి కృష్ణ నామినేషన్స్ లో ఉండగా రాహుల్, వరుణ్ సందేష్ లలో వరుణ్ కూడా రాహుల్ కు సపోర్ట్ గా నిలిచి నామినేషన్స్ లో ఉన్నాడు. ఇక బాబా భాస్కర్, పునర్నవిలలో బాబా భాస్కర్ నామినేషన్స్ లో ఉన్నారు. ఫైనల్ గా 10వ వారం బిగ్ బాస్ హౌజ్ నుండి ఇంటి నుండి బయటకు వెళ్లేందుకు రవి కృష్ణ, బాబా భాస్కర్, వరుణ్ సందేష్, శ్రీముఖి నామినేట్ అయ్యారు. 


ఈసారి ఎలిమినేషన్ కూడా చాలా కష్టమని చెప్పొచ్చు. స్ట్రాంగ్ కంటెస్టంట్స్ అయిన శ్రీముఖి, వరుణ్ లు కాకుండా రవి కృష్ణ, బాబా భాస్కర్ లలో ఒకరు ఇంటి నుండి బయటకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. హౌజ్ లో స్క్రీ స్పేస్ ఎక్కువగా తీసుకుని టాస్కులలో ఎక్కువగా పర్ఫార్మ్ చేసే వారినే ఆడియెన్స్ సేవ్ చేస్తున్నారు. మరి రవి, బాబా భాస్కర్ లలో ఎవరు ఈ వీకెండ్ బయటకు వస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: