తెలుగు గడ్డకు చెందిన వీర విప్లవకారుడు “ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి”  జీవితం ఆధారంగా  మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో  రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం  అక్టోబరు 2న  గాంధీ జయంతి సందర్భంగా  విడుదల కానుంది. ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా  తెలుగు రాష్ట్రాలతో పాటు, యూఎస్ లో కూడా ఈ చిత్రం పై భారీ క్రేజ్ ఉంది.  యూఎస్ లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తీరు చూస్తుంటే.. కొత్త రికార్డ్స్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.  ఇప్పటికే సైరా అడ్వాన్స్ బుకింగ్స్  $ 400000 లకు చేరాయని  తాజా సమాచారం.  సైరా అడ్వాన్స్ బుకింగ్స్ బట్టి  ఫస్ట్ వీక్ లోనే సైరా  వన్ మిలియన్ ను ఈజీగా చేరుకుంటుందని అంచనా.  ఇక  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఎప్పుడో పదేళ్ల  క్రితమే పరుచూరి బ్రదర్స్  'సైరా' స్క్రిప్ట్ ను రాశారు.   సైరా  స్క్రిప్ట్ ఓ రేంజ్ లో ఉంటుందని.. సినిమా ఎలాగూ విజువల్స్ పరంగా అద్భుతంగా ఉంటుందని.. అలాగే స్క్రిప్ట్ పరంగా కూడా ఆకట్టుకోబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో  క్లైమాక్స్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే  నరసింహారెడ్డి జీవితం ఆధారంగా  క్లైమాక్స్  ను తీస్తే.. సాడ్ ఎండింగ్ తో సినిమాని ముగించాల్సి వస్తోంది. అప్పుడు  అభిమానులతో పాటు  ప్రేక్షకులు కూడా నిరాశ చెందుతారు.  అందుకే నరసింహ రెడ్డి చావుతో కాకుండా  నరసింహ రెడ్డి స్ఫూర్తితో …  మళ్లీ  ఎవరెవరు తిరుగుబాటు చేశారనే అంశాల ఆధారంగా క్లైమాక్స్ ఉంటే బాగుటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో చూడాలి.      

  

ఇక నిర్మాత రామ్ చరణ్ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.  ఈ సినిమాలో  సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క  వంటి స్టార్ లు కూడా  నటిస్తున్నారు.  అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా  సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.  ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది.  రామ్ చరణ్  ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో  విడుదల చేయనున్నారు.  కాగా ప్రస్తుతం  రిలీజ్ అవుతోన్న అన్ని భాషల్లో సైరా  ప్రమోషన్లు శరవేగంగా జరుగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: