మొదటితరం స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న ఈ చిత్రంలో సైరా పాత్ర నిజంగా బంధిపోటా లేక స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడా అన్న చ‌ర్చ న‌డుస్తుంది. ఈ విష‌యం పై ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ఈ విధంగా స్పందించారు.


సైరా జర్నీ ఎలా ప్రారంభమైంది?
'ధృవ' సినిమా టైంలో ప్రీమియర్‌ షోకు యు.ఎస్‌. వెళ్ళాం. అక్కడ సక్సెస్‌ టూర్‌ ప్లాన్‌ చేశాం. చరణ్‌, అరవింద్‌ స్వామి అంతా వెళ్ళాం. అక్కడ వుండగానే చిరంజీవిగారి నుంచి నాకు ఓ మెసేజ్‌ వచ్చింది. ఆ తర్వాత రోజు చరణ్‌ నన్ను నెక్ట్స్‌ కమిట్‌ఏమైనా వున్నాయా నాన్నగారితో సినిమా చేస్తారా! అని అడిగారు. అంతకంటేనా! అన్నాను. నేను తిరిగి వచ్చాక చిరంజీవిగారిరి కలిశాను. స్టయిల్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ యాక్షన్‌ ఫిలిం చేయాలని ఆయన చెప్పారు. చిరంజీవిగారు 150వ సినిమా రిలీజ్‌ అయ్యాక.. పెద్ద సినిమా చేద్దామని అన్నారు. పెద్ద సినిమా అంటే ఏమిటనేది తెలీదు. అప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చెప్పారు చిరంజీవిగారు. చేద్దాం. కానీ నాకు టైం కావాలన్నా. ఎందుకంటే ఆయన గురించి పెద్దగా తెలీదు. వెంటనే నేను పరుచూరిబ్రదర్స్‌ను కలిసి కథ విన్నా. వినగానే మంచి కంటెంట్‌ వుందనిపించింది. ఇలాంటి వీరుడు వున్నాడా! అని అనిపించింది. మెంటల్‌గా స్ట్రాంగ్‌ అయ్యాను. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి రకరకాలుగా పుస్తకాలు, గజిట్స్‌ తీసుకుని చదివాను. 20 రోజులు పట్టింది. అలాగే బుర్రకథలు, పాటల రూపంలో కూడా ఆయన గురించి వున్నాయి. అవి విన్నాక నాపై నాకు నమ్మకం ఏర్పడింది. ఆ తర్వాత నెలపాటు మెటీరియల్‌ను పోగుచేసుకుని.. ఈ వీరుడు కథను ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించాను. అలా నెలపాటు నేను రెడీ అయి పరుచూరిని కలిశాను. అందరికీ నమ్మకం ఏర్పడ్డాక చిరంజీవిగారికి కథ చెప్పాను. అప్పుడు రెండు గంటలు నెరేట్‌ చేశాను. వెంటనే సెట్‌పైకి వెళదాం అన్నారు.


అత‌ను బందిపోటా?
‍ - గజెట్‌లో ఇన్‌స్పైర్‌ ఏమిటంటే.. బందిపోటు దొంగ అనే వుంది. నేను చదువుకుంది.. బ్రిటీష్‌కు ఎవరైనా ఎదురొస్తే.. బందిపోటు అని రాస్తారు. కానీ.. అదే టైంలో 9వేలమంది ఈయన వెనకాలవచ్చారని రాశారు. బందిపోటు యితే ఇంతమంది ఎందుకు వస్తారు? అదే నాకు ఇన్‌స్పైర్‌ అయింది. అతన్ని బహిరంగ ఉరిశిక్ష వేశారు.  250 మందిని దీపాంతర శిక్ష వేశారు. ఉరితీశాక హెడ్‌ కట్‌చేసి 30 ఏళ్ళపాటు గుమ్మానికి అలానే పెట్టారు. అలా పెట్టారంటే ఏం జరుగుతుంటుందనే ఆసక్తి.. ఇతను చావుకు ప్రిపేర్‌ అయి వచ్చాడనే.. మాట వుంది.  హి ఈజ్‌ ప్రిపేరింగ్‌ ఫర్‌ వార్‌, అండ్‌ డెత్‌.. అనే మాటలు గెజిట్‌లో వున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: