తొలి తెలుగు స్వాతంత్య్ర పోరాట యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్ర ఆధారంగా   సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో  మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా  మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన  మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీ ‘సైరా’. కాగా  భారీ అంచనాల నడుమ రేపు  గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  'సైరా' కోసం  మెగా అభిమానులతో పాటు యావత్తు ప్రేక్షక లోకం  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అయితే  ఇప్పటికే సినిమాని చూసిన  సెన్సార్ బోర్డు సభ్యులు మరియు కొంతమంది  'సైరా' సినిమా గురించి  సోషల్ మీడియాలో తమ  అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.  'సైరా' వన్ వర్డ్ రివ్యూ అంటూ..  ఒక్క మాటలో  సినిమా 'అవుట్ స్టాండింగ్' అని పోస్ట్ చేశారు.   సైరా అద్భుతమైన పీరియాడిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని.. దర్శకుడు సురేందర్‌ రెడ్డి  సినిమాని చాల గొప్పగా తెరకెక్కించాడని..  చిరంజీవి అద్భుతమైన నటనతో హృదయాలను కదిలించేలా నటించారని  పోస్ట్ చేశారు.  ఖచ్చితంగా  'సైరా'  బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధించడం ఖాయం అంటున్నారు.  కాగా స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను  సురేందర్‌ రెడ్డి  కళ్లకు కట్టినట్లు చూపించారట.  


కాగా మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా  మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ  చిత్రంలో అన్ని భాషల్లోని స్టార్లు నటించడం.. పైగా  ప్రమోషన్స్‌ కూడా కనీవినీ ఎరుగని రేంజ్‌ లో చేస్తుండటం.. అన్నిటికి మించి  భారీ అంచనాలు ఉండటంతో ‘సైరా’ మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీగా రేపు రాబోతుంది.  కాగా బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్  మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించనున్నారు.  ఇక ఈ సినిమాలో  సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క  వంటి స్టార్ లు కూడా  నటిస్తున్నారు.  అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా  సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.  ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో  హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న  ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో  విడుదల చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: