తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో  టాలీవుడ్ యాక్షన్ హీరో  గోపీచంద్ హీరోగా  వస్తోన్న యాక్ష‌న్  స్పై   థ్రిల్ల‌ర్ 'చాణ‌క్య‌'.  కాగా అక్టోబర్  5న ఈ సినిమా  గ్రాండ్ గా విడుదల కానుంది. అయితే  అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా  'సైరా' విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.  280 కోట్ల భారీ బడ్జెట్ మూవీ నేపథ్యంలో సైరాని సోలోగా అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అయితే  సైరా లాంటి భారీ బడ్జెట్ మూవీతో చాణక్య పోటీపడటం ఆసక్తిని రేపుతోంది.  అసలు సైరాకి  చాణక్య పోటీగా ఎందుకు వస్తున్నాడని నెటిజన్లు ప్రశ్నలు కురిపిస్తున్నారు. అయితే ఈ విషయం పై  గోపీచంద్ తాజాగా స్పందించారు.  గోపీచంద్ మాట్లాడుతూ..  'నిజానికి చాణక్య మూవీని మేము  'మే' నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నామని,  కానీ,  నేను గాయపడిన తరువాత షూటింగ్ ఆలస్యం అయింది.  ఇక ఆ తరువాత,  అక్టోబర్ 3న మా సినిమాను విడుదల చేయాలనుకున్నాము,  అప్పటికీ   సైరా విడుదల తేదీ ప్రకటించలేదు.  ఇక సైరా  అక్టోబర్ 2 విడుదల అని ప్రకటించాక,  మేము అక్టోబర్ 5న చాణక్య రిలీజ్ ప్లాన్ చేశాము. అయితే దసరా హాలిడేస్ కాబట్టి  చాణక్యను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. పైగా  చాణక్య మరియు సైరా  రెండు సినిమాలు వేరు వేరు నేపథ్యాలకి సంబంధించినవి' అని గోపిచంద్ చెప్పారు. 

 

కాగా ఈ సినిమాలో  గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్‌ గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తోన్న రెండో చిత్రమిది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  ఈ సినిమాలో గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్‌ లో కనిపించనున్నారు.   కాగా  గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ స్పై థ్రిల్లర్  ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర  నిర్మిస్తున్నారు.  కాగా రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో గోపీచంద్ మాట్లాడుతూ.. 'సంపత్‌ నందితో చేసే సినిమా తరువాత, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌గారి బ్యానర్‌ లో మలయాళ దర్శకుడు బినుతో ఓ సినిమా చేస్తున్నానని..  అలాగే తనకు  మల్టీస్టారర్‌ చేయాలని ఉందని..  కాకపోతే మంచి కథ కుదరడం లేదని..  ఇటీవల ఓ దర్శకుడు కథ చెప్పినా..  ఆ కథలోని క్యారెక్టర్‌ లో దమ్ములేదని చెప్పుకొచ్చాడు.  గోపీచంద్ ఇంకా మాట్లాడుతూ.. 'మంచి కథ కుదిరితే ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ సినిమా కూడా ఒకటి చేయాలనుకుంటున్నానని చెప్పారు.      


మరింత సమాచారం తెలుసుకోండి: