మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్‌ 2న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదలయింది. 


అయితే  ఈ మ‌ధ్య విడుద‌ల‌యిన భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో ఒక‌టి సాహో అయితే మ‌రొక‌టి సైరా ఇవి రెండు చిత్రాలు కూడా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు.   సాహో చిత్రం ఎంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మించినా క‌థ‌లో చాలా క‌న్‌ఫ్యూజ‌న్ ఉండ‌డంతో ఆశించినంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఇక సైరా ప‌రిస్థితికి వ‌స్తే దాదాపుగా ఇది కూడా సాహో దారే ప‌ట్టేలా ఉంది. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన ఈచిత్రం పార్టులు పార్టులుగా మెప్పించిన ఫ‌స్టాఫ్ చాలా నెమ్మ‌దిగా సాగింద‌నే టాక్ ఉంది. సాగ‌తీత స‌న్నివేశాలు ఎక్కువ‌గా ఉండ‌డంతో ప్రేక్ష‌కుల్లో కాస్త బోర్ ఫీలింగ్ క‌నిపిస్తుంది. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వ‌డం ఒక‌ర‌కంగా చెప్పాలంటే క‌లెక్ష‌న్లు వ‌సూల్ చెయ్య‌డం  విష‌యంలో కాస్త ఇబ్బందే కావొచ్చు. కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాలు థ్రిల్లింగ్ ప‌రిచిన‌ప్ప‌టికీ చ‌రిత్ర‌ల గురించి చెప్పే ఈ చిత్రానికి ఆద‌ర‌ణ ఎంత వ‌ర‌కు ల‌భిస్తుందో వేచి చూడాలి. చిరంజీవి పెర్ఫామెన్స్ కోస‌మైన ఈ చిత్రం ఆడితే బాగానే ఉంటుంది. 171 నిమిషాల నిడివితో సాగిన ఈ చిత్రం ల్యాగ్ ఎక్కువ‌వ‌డంతో కొన్ని సీన్స్‌ను కూడా క‌ట్ చేసిన‌ట్లు సురేంద‌ర్‌రెడ్డి తెలిపారు. గోసాయి వెంక‌న్న పాత్ర‌లో బిగ్‌బీ అమితాబ్ పాత్ర అద్భుతంగా ఉంది. ఫైనల్ టాక్ యావ‌రేజ్ అయిన‌ప్ప‌టికీ క‌మ‌ర్షియ‌ల్ గా ఎలా ఉంటుందో చూడాలి. 


పర భాషా మార్కెట్ల కోసం ఆ భాషా నటీనటులను సినిమాలలో ఇరికించడం, కొన్ని సన్నివేశాలను ఆ భాషా ప్రాంతీయత తెలియ వచ్చేలా చిత్రీకరించడం ... మొత్తానికి సినిమాను చప్పటి కిచిడీ చెయ్యడం. ఈ మ‌ధ్య ఇదొక కొత్త ట్రెండ్‌లా మారింది. ఎంతో క‌ష్టంగా మ‌రెంతో బ‌డ్జెట్‌తో నిర్మించే ఈ చిత్రాల వ‌ల్ల న‌ష్టం ఎవ‌రికి జ‌రుగుతుంది అన్న‌ది కాస్త ఆలోచించాల్సిన విష‌య‌మే. ఇప్ప‌టికైనా బ‌డ్జెట్ భారీనా కాదా అన్న‌దానికంటే క‌థ‌లో ద‌మ్ము ఎంత‌వ‌ర‌కు ఉంది. దాన్ని ప్రేక్ష‌కుడు మెచ్చేలా తెర‌కెక్కిస్తున్నామా లేదా అన్న‌ది గ‌మ‌నిస్తే చాలా బావుంటుంద‌న్న‌ది కొంద‌రి సినీ పెద్ద‌ల ఆలోచ‌న‌.



మరింత సమాచారం తెలుసుకోండి: