భారత దేశం కోసం ఎంతో మంది మహాయోధులు బ్రిటీష్ వారితో పోరాటం చేశారు. బ్రిటీష్ సైన్యానికి ఎదురు తిరిగి అమరులైన ఎంతో మంది త్యాగదనులు వారి కథలు వింటుంటే రక్తం ఉప్పొంగి పోతుంది.  అలాంటి వారిలో మంగళ్ పాండే ఒకరు.. ఈస్ట్ ఇండియా కంపెనీ  34వ బెంగాల్ రెజిమెంట్ అందు ఒక సిపాయి.  బ్రిటిషు వారు సిపాయిలకు ఆవు కొవ్వు మరియు పంది కొవ్వును పూసి తయారుచేసిన తూటాలు  ఇచ్చేవారు. 

అయితే ఆవు తమ ఇలవేల్పు అని..ఈ దారుణాన్ని సహించేది లేదని ఆ తూటాలని నోటితో కొరికి తొక్క తొలిగిస్తేనే పేలుతాయి. హిందూ ముస్లిం ఇద్దరికీ ఇవి నచ్చలేదు. ఈ నేపథ్యంలో ప్రప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు.. . సుమారు రెండుశతాబ్దాలు మన దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలించిన బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్ర్య సమర యోధుడు మంగళ్ పాండే.  అప్పటివరకూ బ్రిటిష్ వారి పెత్తనానికి తలొగ్గి వాళ్ళు చేస్తున్న అరాచకాలు, అవమానాలు మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సాధన వైపు తిప్పారు. ఈ కథను అప్పట్లో కేథన్ మెహతా దర్శకత్వంలో అమీర్ ఖాన్ మంగళ్ పాండేగా నటించాడు. 

భారీ అంచనాల మద్య హిస్టారికల్ మూవీగా రిలీజ్ అయిన మంగళ్ పాండే దారుణమైన ఫలితాన్ని పొందింది. దానికి కారణం అసలు కథ పక్కన బెట్టి హీరోయిజం..పాటలు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఇదే తరహాలో ఇప్పుడు ‘సైరా నరసింహారెడ్డి’ తెరపైకి వచ్చింది. బ్రిటీష్ వారిని ఎదిరించి పోరాడిన తొలి తెలుగు బిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ కూడా హీరోయిజం..గ్రాఫిక్స్ మాయాజాలం, కమర్షియల్ ఎలిమెంట్స్ తో నే తీశారని పెదవి విరుస్తున్నారు సినీ ప్రేక్షకులు.   


మరింత సమాచారం తెలుసుకోండి: