మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన సైరా సినిమా బుధ‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏకంగా ఐదు భాష‌ల్లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. తెలుగు జాతి గ‌ర్వించ‌ద‌గ్గ ఓ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడి చ‌రిత్ర‌ను తెర‌కెక్కించే అవ‌కాశం రావ‌డం అంటే అది ఓ మ‌హ‌త్త‌ర అవ‌కాశం గానే భావించాలి. తెలుగు సినిమా ఖ్యాతి బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 సినిమాల త‌ర్వాత ఓ రేంజ్‌కు వెళ్లింది. 


ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో తెలుగులో గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, సాహో, సైరా లాంటి చారిత్రక‌, భారీ బ‌డ్జెట్ సినిమాలు రావ‌డం విశేష‌మే. అయితే వాటిని అంది పుచ్చుకునే విష‌యంలో బొక్క బోర్లా ప‌డుతున్నారు. శాత‌క‌ర్ణి విష‌యంలో క్రిష్ సాధించిన విజ‌యం ప‌క్క‌న పెడితే సాహో విష‌యంలో సుజీత్ ఎలా క‌థ‌ను ప‌క్క‌న పెట్టి బ‌డ్జెట్‌ను నెత్తిమీద పెట్టుకుని ఎలా ?  నేల విడిచి సాము చేసి బొక్క బోర్లా ప‌డ్డాడో సైరా విష‌యంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింద‌నే చెప్పాలి.


ఇక ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ సైరాకు క‌థ ఇస్తే దానిని కాద‌ని సురేంద‌ర్‌రెడ్డి సొంతంగా రీసెర్చ్ చేసుకుని సొంత పైత్యంతో క‌థ‌లో చాలా మార్పులు, చేర్పులు చేసి కిచిడీ చేసి ప‌డేశాడు. డ‌బ్బులు పెట్టేందుకు రామ్ చ‌ర‌ణ్ ఉన్నాడ‌న్న ధీమాతో డ‌బ్బులు ఇర‌గ ఖ‌ర్చు పెట్టించేసి క‌థ‌ను క‌మ‌ర్షియ‌లైజ్ చేసి ప‌డేసి... ఇష్ట‌మొచ్చిన‌ట్టు చేసేశాడు.


సినిమాలో ఎన్ని భారీ సెట్టింగులు ఉన్నా, ఎంత హంగులు ఉన్నా, ఎంత మంది ఇత‌ర భాషా న‌టీన‌టులు ఉన్నా క‌థ‌నంలో ద‌మ్ము లేన‌ప్పుడు సాహో అయినా ఒక‌టే.. సైరా అయినా ఒక‌టే అన్న‌ది మ‌రోసారి ఫ్రూవ్ అయ్యింది. ఓ చారిత్ర‌క హీరో క‌థ‌ను తెరకెక్కించే సువ‌ర్ణావ‌కాశాన్ని సురేంద‌ర్‌రెడ్డి చేజేతులా పాడు చేసుకున్నాడు. ఇప్ప‌టికి అయినా మ‌న తెలుగు హీరోలు ఇలా చేసేట‌ప్పుడు క‌థ‌, క‌థ‌నాల‌పై కాన్‌సంట్రేష‌న్ చేస్తే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: