భారతీయ చలన చిత్ర రంగంలో ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చారు..అయితే ఎవరి క్రేజ్ వారికి ఉన్నా, అందులో ఏఆర్ రెహమాన్ భిన్నమైన తేడా కనిపిస్తుంది.  ఆయన సంగీతం అంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ కావాల్సిందే. క   సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, గీత రచయిత, నిర్మాత, సంగీతకారుడు.  రెహమాన్ అసలు పేరు ఎ. ఎస్. దిలీప్ కుమార్. తండ్రి నుంచి సంగీత వారసత్వం పుచ్చుకున్న రెహమాన్ చిన్నతనంలో తండ్రి మరణంతో కుటుంబాన్ని పోషించడానికి పలువురు సంగీత దర్శకుల దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. 

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా మూవీకి తన సంగీతంతో మంత్ర ముగ్దులను చేశారు.   మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కింది. ప్రపంచ సంగీతం, ఎలక్ట్రానిక్ సంగీతం, సంప్రదాయ ఆర్కెస్ట్రా అరేంజ్మెంట్లనూ ఉపయోగించి ఆయన చేకూర్చే సంగీతం అద్భుతం అంటారు. లవ్, ఎమోషనల్,థ్రిల్,హిస్టారికల్ మూవీస్ కి ఆయన సంగీత నేపథ్యం ఎంతో అద్బుతంగా ఉంటుందంటారు.  మెగాస్టార్ హీరోగా రికార్డు స్థాయి బడ్జెట్‌తో రూపొందిన  ‘సైరా నరసింహారెడ్డి’కి మొదట ఏఆర్ రెహమాన్ ని అనుకున్నారట. సంగీత దర్శకుడిగా మొదట ఏఆర్‌ రహమాన్‌ను ఎంపిక చేసిన విషయం తెల్సిందే.

రహమాన్‌ అవ్వడంతో తెలుగులోనే కాకుండా హిందీ, తమిళంలో కూడా భారీ అంచనాలు పెరగడం ఖాయం అని అంతా భావించారు. కాని అనూహ్యంగా రహమాన్‌ ఈ చిత్రం నుండి తప్పుకున్నట్లుగా ప్రకటించాడు. రహమాన్‌ స్థానంలో బాలీవుడ్‌ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదిని తీసుకున్నారు. కాకపోతే అమిత్ త్రివేది మ్యూజిక్ లో వచ్చిన సాంగ్స్ ఏమాత్రం అలరించలేక పోయాయని అంటున్నారు. అదే ‘సైరా’కి రెహమాన్ మ్యూజిక్ ఇచ్చి ఉంటే ఈ మూవీకి మరికొంత హైప్ వచ్చి ఉండేదని ప్రేక్షకులు భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: