టాలీవుడ్ లో గతంలో స్టార్ హీరోల సినిమాలు మినిమం రూ.50 కోట్ల బడ్జెట్ వరకు ఉండేది.  అది కూడా నిర్మాతలు ఆచీ..తూచి డైరెక్టర్, హీరో ల క్రేజ్ ని పెట్టి పెట్టుబడులు పెట్టేవారు.  కానీ ఈ మద్య బడ్జెట్ ఈజీగా వంద కోట్లు దాటిపోతుంది. ముఖ్యంగా వ్యూజువల్ వండర్స్ నేపథ్యంలో వస్తున్నమూవీస్ కనీసం వంద కోట్ల పట్టుబడి లేకుండా పూర్తికాని పరిస్థితి నెలకొంది.  ఇక టాలీవుడ్ లో దర్శకధీరుడు  రాజమౌళి  50 కోట్ల మార్క్ కి గుడ్ బాయ్ చెప్పి 100 కోట్లకు తీసుకు వెళ్లారు. ఆయన తీసిన ‘బాహుబలి’ మూవీ రూ.200 కోట్ల బడ్జెట్ తో తీసి సూపర్ హిట్ సాధించాడు. 

అప్పటి నుంచి తెలుగు లో వంద కోట్ల బడ్జెట్ సినిమాలు తెరకెక్కడం మొదలయ్యాయి. తెలుగు లో బాహుబలి సీరీస్ అన్ని భాషల్లో రిలీజ్ చేసి వండర్ సృష్టించారు రాజమౌళి.  అప్పటి నుంచి తెలుగు సినిమాలో మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ చేయడం మొదలు పెట్టారు..అందుకు చిత్ర యూనిట్ అక్కడికి వెళ్లి ప్రమోషన్లు కూడా చేయడం మొదలు పెట్టారు.  బాహబలి 2 కోసం బాలీవుడ్ లో ఎంత హంగామా చేశారు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మద్య సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటించిన ‘సాహెూ’ మూవీ రూ.350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. 

ఈ మూవీ ఆరంభ శూరత్వం అన్నట్లు థియేటర్లో తేలిపోయింది.  దాంతో చాలా చోట్ల డిస్ట్రిబ్యూటర్లు తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది.  హీరోని బేస్ చేసుకొని సినిమాలు తీస్తే ప్రతిఫలం కొన్ని సార్లు దారుణంగా ఉంటుందని.. ఆ మద్య రజినీకాంత్ నటించిన ‘లింగ’, ‘కబాలి’,‘కాలా’ లాంటి మూవీస్ ఫ్లాప్ చూస్తేనే తెలిసిపోయింది.  ఇప్పుడు ఇదే పరిస్థితి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ కి నెలకొంది.  ఈమూవీ రూ.300 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు..అయితే టాక్ మాత్రం ప్రీమియం టాక్ మాత్రం మిక్స్ డ్ గా వినిపిస్తుంది. మరి టాలీవుడ్ లో రూ.300 కోట్ల బడ్జెట్ పెద్ద హీరోలకు అచ్చి రావడం లేదా ఏంటని ప్రేక్షకులు చెవులు కొరుక్కుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: