ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది ఇండస్ట్రీలో. భారీ బడ్జెట్లతో భారీ చిత్రాల్ని అన్ని భాషల్లో  అందరిని అలకరించేలా రిలీజ్ చేస్తున్నారు. అయితే చిన్న సినిమాలకు ఆ అర్హత లేదా? అంటే ఉంది అని నిరూపిస్తోంది ఒక చిన్న సినిమా. మలయాళ దర్శకుడు లిజ్జో జోస్ పెల్లీ సెరి రూపొందిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ `జల్లికట్టు`. మిస్టరీ కథాంశంతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెర మీదికి తెస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. 

కంప్లీట్ డార్క్ లో తీసిన ఈ ట్రైలర్ ఈ సినిమా బిజినెస్ ని ప్రభావితం చేస్తోందనేందుకు ఈ లెక్కలే ప్రూఫ్. చాలా ఇంటెన్స్ తో వున్నఈ ట్రైలర్  ఆసక్తిని రేకెత్తించడంతో ఈ చిత్ర ఓవర్సీస్ రైట్స్ కోసం చాలా మంది పోటీ పడ్డారట అని సమాచారం . అయితే ఫ్యాన్సీ రేట్ ని కోట్ చేసిన సోహన్ రాయ్ గ్రూప్ ఇండీవుడ్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ సొంతం కూడా చేసుకుంది. ఈ సంస్థ యుకే- యూరప్- సింగపూర్- కొరియా దేశాల్లో ఈ చిత్రాన్ని పంపిణీ చేయబోతోందంటే దీనిపై ఎంత ఆసక్తి క్రియేటైందో అర్థం చేసుకోవచ్చు మరి.

యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ దగ్గరి నుంచే జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఎక్కడి నుంచో ఓ గ్రామంలోకి వచ్చిన  ఓ గేదె ఊరి వాళ్ల నుంచి తప్పించుకుంటూ హల్ చల్ చేస్తుంటుంది. ఈ క్రమంలో హత్యలు జరిగిపోతుంటాయి, పంట పొలాల్ని నాశనం చేస్తూ ఊరి జనాలకు నిద్ర లేకుండా నరకం చూపిస్తుంటుంది. దాంతో ఆ ఊరిలో వున్న ప్రతి వ్యక్తి  ఆ గేదెను చంపాలని తిరుగుతుంటారు అందరు. నరకం చూపిస్తున్న బఫెల్లో సమస్య నుంచి ఆ గ్రామం ఎలా బయటపడింది? అన్నది ఆసక్తి కరంగా దర్శకుడు తెరకెక్కించిన తీరు సినిమాపై అంచనాల్నిపెంచేస్తోంది.

 ముఖ్యంగా ఈ సినిమాకి ఉపయోగించిన లైటింగ్ స్కీమ్ మైమరిపిస్తోంది. నేపథ్య సంగీతం రక్తి కట్టిస్తోందని ప్రశంసలొచ్చాయి. చిన్న సినిమా అయినా కంటెంట్ నచ్చితే పాన్ ఇండియా సినిమాలా విజయం అందుకుంటున్న రోజులివి. మరి జల్లికట్టు ఎలాంటి మ్యాజిక్ చేయనుందో  చూడాలి.  తెలుగు రాష్ట్రాల వరకూ ఇప్పటివరకూ ఈ సినిమా బిజినెస్ సాగలేదు. అయితే ఇక్కడా మన వాళ్లకు కంటెంట్ నచ్చి రిలీజ్ చేసే వీలుందని అంచనా కూడా  వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: