ఒకేరోజు మూడు భారీ సినిమాలు రిలీజయ్యాయి. అయితే ఇదేమంత కొత్త విషయం కాదు. ఇలాంటి సందర్భాలు గతంలో చాలానే జరిగాయి. ఇక ఈ వారం రిలీజైన సినిమాలలలో ఒకటి తెలుగు సినిమా 'సైరా నరసింహారెడ్డి'. మరొకటి బాలీవుడ్ సినిమా 'వార్'.. ఇంకోకటి హాలీవుడ్ సినిమా 'జోకర్'. ఒక్కో భాష నుంచి ఒక్కో సినిమా. ఈ మూడు సినిమాలు ఎంతో క్రేజుతో బారీ స్థాయిలో రిలీజైనవే. అయితే ఈ మూడు సినిమాల మీదా పాజిటివ్ టాక్ తో పాటు కాస్త నెగిటివ్ టాక్ కూడా వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇండియాలో 'సైరా'.. 'వార్' సినిమాలపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. తొలి రోజు రికార్డులు సహా తొలి వీకెండ్ వసూళ్లపైనా ట్రేడ్ వర్గాలు భారీ అంచనాల్ని వెలుబుచ్చుతున్నారు. ప్రస్తుతం వచ్చిన అంచనా ప్రకారం.. ఈ మూడు సినిమాలు కలిపి దేశవ్యాప్తంగా 150-200 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసి ఉంటాయని అంచనా వేస్తున్నారు. సైరా తొలి రోజు వసూళ్లు అన్ని భాషలు కలుపుకుని సుమారు 50 కోట్లు ఉంటుందని అంచనా. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్లాష్ అయినా అడ్వాన్సు బుకింగ్ ల ద్వారా భారీగా వసూలు చేశాయని తాజా సమాచారం. పైగా పాజిటివ్ టాక్ ఉండడంతో వసూళ్ల పరంగా తగ్గవని ప్రముఖ క్రిటిక్స్ కూడా విశ్లేషించారు.

గాంధీ జయంతి తో పాటు దసరా సెలవులు కూడా కావడం తో ఈ సినిమాలకు దేశీయంగా మంచి వసూళ్లకు ప్లస్ అవుతుందని క్రిటిక్స్ ధీమాగా అంచనా వేస్తున్నారు. హృతిక్ రోషన్- టైగర్ ష్రాఫ్ నటించిన వార్ సినిమా అడ్వాన్స్ బుకింగుల ద్వారానే 30కోట్లు వసూలు చేసిందట. ఈ సినిమా ఓపెనింగ్ రోజునే 70 % బుకింగ్స్ జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా లెక్కలు తెలిస్తే ఈ సంఖ్య పెరుగుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి-అమితాబ్ సహా అన్ని భాషల స్టార్లు నటించడం వల్ల సైరా కి ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగా వచ్చాయంటున్నారు. ఇక హాలీవుడ్ సినిమా జోకర్ కి పాజిటివ్ టాక్ వచ్చింది. రివ్యూస్ కూడా పాజిటివ్ గా వచ్చాయి. అందువల్ల ఈ సినిమా కూడా భారీగానే వసూళ్ళు రాబట్టిందని తెలుస్తోంది. ఇక మౌత్ టాక్ తో ఈ మూడు సినిమాల వసూళ్ళు రెండవ రోజు కూడా భారీగా వచ్చే అవకాశం ఉందని తాజా సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: