మెగాస్టార్ చిరంజీవి నటించిన  ప్రతిష్టాత్మక చిత్రం  "సైరా నరసింహారెడ్డి". ఈ సినిమా  నిన్న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో  గ్రాండ్ గా విడుదలైంది. విడుదలకు ముందునుండే ఎన్నో అంచనాలు ఉన్నాయి.అయితే ఆ అంచనాలను అందుకునే దిశగా సైరా జోరు కొనసాగుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా చిత్రంకు మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి. అమెరికాలో ఒకరోజు ముందే రిలీజైన ఈ సినిమాకు రికార్డ్  కలెక్షన్లు వచ్చాయి. మూవీ పై ఉన్న హైప్ దృష్ట్యా యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ కూడా సైరా సత్తా చాటింది.


మంగళవారం ప్రీమియర్స్ ద్వారా $8,17,0000 డాలర్ల వసూళ్లు రాబట్టిన సైరా నార్త్ అమెరికా ఐనా కెనడాలో మరో $40,122 ప్రీమియర్ కలెక్షన్స్ తో మొత్తంగా $8,57,000 గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇక నిన్న బుధవారం సాయంత్రం 3:30 వరకు 250 లొకేషన్స్ నుండి $1,45,000 డాలర్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు సమాచారం. దీనితో మొత్తంగా వన్ మిలియన్ వసూళ్లను సైరా తక్కువ సమయంలో సాధించింది. హిట్ టాక్ నేపథ్యంలో రాబోయే వారాంతపు సెలవులలో సైరా వసూళ్లు మరింత పెరిగే అవకాశం కలదు.


ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం కలెక్షన్లు బాగానే ఉన్నాయి. చెన్నై, బెంగళూరులో స్పెషల్ షోస్ కూడా వేయడంతో కలెక్షన్లు మరింత పెరిగాయి. కలెక్షన్ల పరంగా సైరా ఎన్ని రికార్డులు సృష్టించనుందో! చిరంజీవి మొదటిసారి ఒక స్వాతంత్ర్య సమరయోధుడిగా నటించిన సైరా చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై  హీరో రామ్ చరణ్  స్వయంగా నిర్మించారు. నయనతార, తమన్నా, అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, సుదీప్ కీలక పాత్రలు చేయడం జరిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: