మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ప్రెస్టీజీయిస్ మూవీ మెగా అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమాలో చిరంజీవి ఒన్ మ్యాన్ షో చూసి నిజమైన ‘బాస్ ఈస్ బ్యాక్’ అంటే ఇదే అంటూ అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. సినిమాలో ప్రతి ఫ్రేములో కథ ఉంటుంది. చారిత్రాత్మక సినిమాలు చెప్పేటప్పుడు ప్రేక్షకులను ఆ కాలంలోకి తీసుకెళ్లగలిగితే ఆ సినిమా సక్సెస్ అయినట్టే. సినిమాలో పాత్రధారలు వేష భాషలు, ప్రాంతాలు, ఆర్ట్ డిపార్ట్ మెంట్, కెమెరా పనితనంతో దర్శకుడు తనకు కావల్సిన దానిని రాబట్టుకున్నాడనే చెప్పాలి.

 


సాధారణంగా చిరంజీవి ఏ సినిమా చేసినా ఒన్ మ్యాన్ షోలానే ఉంటుంది. ఇప్పుడీ సినిమాలో కూడా 64ఏళ్ల వయసులో చూపించిన రౌద్రం, పలికిన డైలాగులు, సన్నివేశాలతో సినిమాను ఒక్కడై నడిపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాను ఓ స్థాయిలో ఉంచుతుంది. చిరంజీవి తన పెర్ఫార్మెన్స్ తో నటనలో తన స్థాయి ఏంటో తెలియజెప్పాడనే చెప్పాలి. కళాతపస్వి కె. విశ్వనాధ్ ఓ సందర్భంలో అన్నట్టు.. “ఆపద్భాందవుడు లో చిరంజీవి నటన రాబోయే తరాలకు ఓ లెసన్” అన్నారు. సైరా చూసిన ఎవరికైనా ఆ మాటలు నిజమేనని మరోసారి రుజువు చేస్తాయి. బ్రిటిషర్స్, ఆ కాలంలో ఉండే వస్తువులు, వేషభాషలతో సినిమాను 200ఏళ్ల వెనక్కి తీసుకెళ్లారు. ప్రతి ఫ్రేమ్ లో రామ్ చరణ్ తపనే కనిపిస్తుంది. అంత గ్రాండియర్ గా సినిమాను తెరకెక్కించాడు. దర్శకుడిగా సురేందర్ రెడ్డి టేకింగ్ లో నెక్స్ట్ లెవల్ చూపించాడనే చెప్పాలి. ఈ తరహా సినిమాలకు తాను కూడా ఓ అప్షన్ అని నిరూపించుకున్నాడు.

 


నరసింహారెడ్డి పోరాట పటిమను, పాలెగాళ్ల వ్యవస్థను కళ్లకు కట్టినట్టు చూపించారు. సినిమాలో నుంచి వాస్తవంలోకి వెళ్లి ఆలోచిస్తే నిజంగా అప్పటి పరిస్థితులు ఇలా ఉండేవా అనిపించక మానదు. సైరా కథలో ఊహకందని భావోద్వేగమేదో ఉంటుంది. సినిమాలో ప్రధానమైనది ఇదే.


మరింత సమాచారం తెలుసుకోండి: