బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఏడాదికి ముడు నాలుగు సినిమాలు చేస్తుంటారు. బాలీవుడ్ స్టార్లందరితో పోలిస్తే అక్షయ్ చేసే సినిమాలు చాలా ఎక్కువ. ఏ సినిమాకైనా సంవత్సరాల తరబడి సమయం తీసుకోవడం అక్షయ్ కి అలవాటు లేదు. షారుక్ ఖాన్, ఆమీర్ ఖాన్ లాంటి వారు సైతం సంవత్సరానికి ఒక్క సినిమా చేయడానికే ఇబ్బంది పడుతుంటే అక్షయ్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.


సినిమాలు చేయడమే కాదు కలెక్షన్లు కూడా అదే స్థాయిలో రాబడుతున్నాడు. అందుకే ఈ సంవత్సరం  ఫోర్బ్స్ జాబితాలో అక్షయ్ పేరు ఉంది. అయితే అక్షయ్ కుమార్ ప్రస్తుతం "లక్ష్మీ బాంబ్" అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తమిళంలో విజయం సాధించిన "కాంచన 2" కి రీమేక్. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. అందుకని ఇదే సిరీస్ లో లారెన్స్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు.


ఇప్పటికే ఈ సిరీస్ లో నాలుగు సినిమాలు చేశాడు. గమ్మత్తేంటంతే ఈ నాలుగు సినిమాలు సూపర్ డూపర్ హిట్లే. తెలుగు, తమిళంలో సూపర్ హిట్ సాధించిన కాంచన 2 చిత్రాన్ని అక్షయ్ కుమార్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకుడిగా అక్షయ్ కుమార్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్ర కొత్త పోస్టర్ ఈ రోజే వచ్చింది. ఈ పోస్టర్ లో అక్షయ్ కుమార్ హిజ్రా గెటప్ లో ఉన్నాడు.ఎర్ర చీర ధరించి, ముఖాన పెద్ద బొట్టుతో కాళీ మాత ముందు నిలబడి కళ్ళలో కోపంతో తానే ఓ కాళీలాగా కనిపిస్తున్నాడు. 


తెలుగు, తమిళంలో సూపర్ హిట్ సాధించిన ఈ చిత్రం హిందీ జనాలకి నచ్చుతుందో లేదో చూడాలి. ఒకవేళ ఈ సినిమా విజయం సాధిస్తే, లారెన్స్ ఇంకా మిగిలిన రెండు సిరీస్ లని కూడా హిందీలో తెరకెక్కించే ప్రయత్నం చేస్తాడేమో! ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుంది.





మరింత సమాచారం తెలుసుకోండి: