మెగా కాంపౌండ్ హీరోల మీద ఇండ‌స్ట్రీలో ఎప్పటి నుంచో కొన్ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. సినిమా క‌థ‌, క‌థ‌నాల విష‌యంలో వాళ్లు వేలుపెట్టి బాగా కిచిడీ చేసేస్తార‌ని... వాళ్ల‌కు న‌చ్చిన‌ట్టే సినిమా తీయాల‌ని... ఒక‌సారి క‌థ ఓకే అయ్యాక కూడా వాళ్లు సెట్స్‌లో కూడా మార్పులు,  చేర్పులు చేయాల‌ని ద‌ర్శ‌కుడిపై ఒత్తిడి చేస్తార‌న్న టాక్ ఎప్ప‌టి నుంచో ఉంది. ఇండ‌స్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా మెగా కాంపౌండ్ హీరోల మీదే ఈ కంప్లెంట్లు ఎక్కువుగా వినిపిస్తుంటాయి.


అంతెందుకు చిరు చాలా రోజుల త‌ర్వాత ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్‌లో అప్పటికే హిట్ అయిన క‌త్తి సినిమాకు రీమేక్‌గా వ‌చ్చిన ఈ సినిమాలో సైతం డైరెక్ట‌ర్ వినాయ‌క్‌ను డామినేట్ చేసేసి సినిమాను కొంత సొంతంగా తీసుకున్నాడ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇక సినిమా అంతా తానై ఉండేలా చూసుకునేందుకు చిరు ఎక్కువ తాప‌త్ర‌య ప‌డ‌తార‌న్న టాక్ ఎప్పటి నుంచో ఉండ‌నే ఉంది.


బాహుబ‌లి సినిమాలో అన్ని పాత్ర‌లు బాగా ఎలివేట్ అయ్యాయి. అటు రానా, ప్ర‌భాస్‌, రమ్య‌కృష్ణ‌, త‌మ‌న్నా చివ‌ర‌కు నాజ‌ర్ లాంటి వాళ్ల పాత్ర‌లు తెర‌మీద‌కు వ‌చ్చిన‌ప్పుడు అవి ఆ సీన్లు ఎలివేట్ అయ్యే వ‌ర‌కు తెర‌మీద క‌నిపించాయి. సైరాలో అలా ఏ ఒక్క‌రి పాత్ర క‌న‌ప‌డ‌లేదు. చివ‌ర‌కు త‌మ‌న్నా సైరాను ఎటాక్ చేసేందుకు బ్రిటీష‌ర్లు దాచుకున్న మందు సామ‌గ్రి మొత్తాన్ని త‌న‌కు తాను ఆహుతై నాశ‌నం చేస్తుంది. ఈ సీన్‌ను చాలా చక్క‌గా ఎలివేట్ చేయ‌వ‌చ్చు.


క‌నీసం ఈ సీన్ కూడా ప‌రిపూర్ణంగా... ప్రేక్ష‌కులు మ‌న‌స్ఫూర్తిగా చూడ‌కుండానే మాయం చేసేశారు. వెంట‌నే కెమేరా ఫోక‌స్ చిరు మీద‌కు వెళ్లిపోతుంది. లేదా ఎడిటింగ్‌లో కావాల‌నే ట్రిమ్ చేయించేసి ఉండొచ్చు. ఏదేమైనా సినిమాలో తాను కాకుండా ఇంకెవ‌రిని డామినేట్ అవ్వ‌కుండా చిరు మొత్తం వాచ్ చేస్తూనే ఉంటాడ‌న్న ఆరోప‌ణ‌ల‌కు మ‌రోసారి సైరా ఫ్రూవ్ చేసిన‌ట్ల‌య్యింది. క‌నీసం న‌య‌న‌తార పాత్ర‌కు కూడా స్కోప్ లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: