ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా రిలీజ్ టైంలో ఆ సినిమాకు బాల‌య్య గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా నుంచి పోటీ ఎదురైంది. ఇంకా చెప్పాలంటే ఇటు చిరు 150వ సినిమా వ‌ర్సెస్ బాల‌య్య 100వ సినిమా సంక్రాంతి రేసు హీటెక్కేసింది. ఈ రెండు సినిమాలు బాగానే ఆడాయ్ అది వేరే విష‌యం. ఖైదీ రిలీజ్ అయిన మ‌రుస‌టి రోజే శాత‌క‌ర్ణికి సూప‌ర్ హిట్ వ‌చ్చేసింది. ఆ వెంట‌నే అల్లు అర‌వింద్ ప్రెస్ మీట్ పెట్టేసి ఖైదీ తొలి రోజు రు.47 కోట్ల వ‌రకు వ‌సూళ్లు రాబ‌ట్టింద‌ని చెప్పేశారు.


అంత అవ‌స‌రం లేక‌పోయినా త‌మ సినిమా గొప్ప అనేందుకు అంత ఫిగ‌ర్ చూపించార‌న్న ప్ర‌చారం అప్పుడు వ‌చ్చింది. ఇక ఆ త‌ర్వాత స‌రైనోడు, డీజే సినిమాల వ‌సూళ్ల విష‌యంలో ఎంత హంగామా న‌డిచిందో ?  అందులో ఒరిజిన‌ల్ వ‌సూళ్లు ఎంతో .. ?  ఫేక్ ప్ర‌చారం ఎంతో చూశాం. బిలో యావ‌రేజ్ /  ప్లాప్ టాక్ వ‌చ్చినా డీజే కూడా కోట్ల‌కు కోట్లు వ‌సూళ్లు రాబ‌ట్టింద‌ని చెప్పుకోవ‌డం వాళ్ల‌కే చెల్లింది. 


ఇక ఇప్పుడు సైరా వ‌చ్చింది.. భారీ బ‌డ్జెట్‌.. ఐదు భాష‌ల రిలీజ్ ఊరుకుంటారా ?  మ‌రింత‌గా రెచ్చిపోతున్నారు. సైరా తొలి రోజు రు.180 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింద‌ట‌. తెలుగు త‌ప్పా ఈ సినిమా మిగిలిన నాలుగు భాష‌ల్లోనూ డిజాస్ట‌ర్ టాక్‌తో న‌డుస్తోంది. ఈ ఫేక్ ఫిగ‌ర్స్ ఇలా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రు. 85 కోట్లు - తెలుగురాష్ట్రాలు మినహా దక్షిణాదిలో రూ. 32 కోట్లు - ఉత్తరాదిలో రూ. 35 కోట్లు - ఓవర్సీస్‌లో రూ. 28 కోట్ల మేర వసూలు రాబట్టింద‌ట‌.

ఓవరాల్‌గా రూ. 180 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లను రాబట్టినట్లు ప్ర‌చారం చేసుకుంటున్నారు. మ‌రి ఈ లెక్క‌లు ఏరియాల వారీగా ఎక్క‌డ నుంచి వ‌చ్చాయో ?  ఓ అంచ‌నాగా ఫిగ‌ర్లు వేసి మ‌రీ ఇంత డ‌బ్బా కొట్టుకోవ‌డం వ‌ల్ల క‌లెక్ష‌న్లు రాకుండా .. వ‌చ్చిన‌ట్టు చూపించుకోవ‌డం వ‌ల్ల ?  ఏం ఉప‌యోగం ఉంటుందో ?  



మరింత సమాచారం తెలుసుకోండి: