ఈ మద్య కాలంలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయి హిట్, ఫ్లాప్ టాక్ తెచ్చుకొని పైసా వసూల్ చేసే వరకు టెన్షన్ పడుతున్న విషయం తెలిసిందే.  స్టార్ హీరోల ఇమేజ్ ని బట్టి పెట్టిన పెట్టుబడి వస్తుందా రాదా అన్న విషయం పక్కనబెడితే..విడుదలైన చిన్నాదా..పెద్దదా అనే తేడా లేకుండా ఏ సినిమా అయినా క్షణాల్లో పైరసీ చేస్తున్నారు.  ముఖ్యంగా తమిళ రాకర్స్ ఈ పైరసీ పెద్ద ఎత్తున చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం పైరసీ చేస్తున్న వెబ్ సైట్ పై కొరడా ఝులిపించినా..వేరు వేరు వెబ్ సైట్లలో పైరసీ చేస్తున్నారు. 

తాజాగా నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ‘సైరా’ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే పైరసీ కావడం..నెట్టింట్లో ప్రత్యేక్షం కావడం జరిగింది.   చాలా మంది నిర్మాతలు చాలా ప్లాన్స్ వేసినా కూడా ఈ పైరసీని అడ్డుకోలేకపోతున్నారు. ఇప్పుడు సైరా విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సినిమా పైరసీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు దర్శక నిర్మాతలు. దానికోసం యాంటీ పైరసీ సెల్ కూడా ఏర్పాటు చేసి ఓ ఈ మెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. 

తాజాగా వచ్చిన మెయిల్ ఐడీకే కొన్ని వేల పైరసీ లింక్స్ రావడంతో పరేషాన్ అవుతున్నాడు నిర్మాత రామ్ చరణ్. దీనిపై ఆయన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక ఇప్పుడు పైరసీపై అధికారికంగా ఫిర్యాదు చేయబోతున్నారు తెలిపారు చిత్ర యూనిట్.  ఈ నేపథ్యంలో రామ్ చరణ్   పైరసీ చేసే వాళ్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఒక గొప్ప స్వాతంత్ర వీరుడి గాథను ప్రజలకు తెలియాలని ఈ సినిమా తీశారని..దీన్ని ఆదరించాలే తప్ప అప్రతిష్ట పాలు చేయొద్దని అంటున్నారు రాంచరణ్. 


మరింత సమాచారం తెలుసుకోండి: