సైరా చిత్రం నిర్మాణ బాధ్యతల నుండి ప్రమోషన్ వరకు అన్నీ తన భుజాలపై వేసుకున్నాడు మెగాపవర్స్టార్ రామ్ చరణ్. కానీ మెగాస్టార్ మాత్రం ఈ సినిమా ప్రమోషన్స్ లో గాని ఇంటర్వ్యూకు సంబంధించి కానీ మీడియా ముందుకు వచ్చింది లేదు. ప్రీమియర్ షోల నుండే సినిమా పాజిటీవ్ టాక్ అందుకొని బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుంది సైరా నరసింహారెడ్డి. ఇప్పటికే ఇండస్ట్రీలో ప్రముఖ నటులు డైరెక్టర్లు స్టార్లు 'సైరా' చూసి తమ అనుభూతులను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ మెగాస్టార్ అండ్ టీం కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 


మరోవైపు  దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సినిమా చూసి ట్విట్టర్ లో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ...సైరా టీం కి శుభాకాంక్షలు తెలిపారు.అయితే సైరా సినిమా సక్సెస్ అయిన సందర్భంగా రేపు ఎట్టకేలకు తెలుగు మీడియా ముందుకు రాబోతున్నారు చిరు. సినిమా మొదలైనప్పటి నుండి ఇంత వరకూ సైరాకి సంబంధించి తెలుగులో ఒక్క ప్రెస్ మీట్ కి కూడా మెగాస్టార్ చిరంజీవి హాజరుకాలేదు. రిలీజ్ కి ముందు రోజు కేవలం ఒక్క సాక్షి ఛానెల్ కి మాత్రమే ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.


అది కూడా ఎందుకంటే 'సైరా'కి సాక్షి మీడియా పార్ట్నర్ ..... అందుకే ఛానెల్స్ లో సాక్షితో మాత్రమే మాట్లాడారు.తన 151వ సినిమా ను ఇంత ఘనంగా ఆదరించిన అందుకుగాను ప్రేక్షకులందరికీరేపు తెలుగు మీడియాతో 'సైరా' సక్సెస్ ను పంచుకొని తద్వారా ప్రేక్షకులకు థాంక్స్ చెప్పబోతున్నారు మెగాస్టార్. హైదరాబాద్ లో జరగనున్న ఈ ప్రెస్ మీట్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సైరా సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి సారిగా మీడియా ముందుకు రాబోతున్న మీడియా మీట్ కోసం ఓ స్టార్ హోటల్ లో స్లాట్ బుక్ చేశారు కూడా. 


మరి 'సైరా'కి సంబంధించి తొలి సారి తెలుగు మీడియా ముందుకు వస్తున్న చిరు రేపు ఈవెంట్ లో  చూడబోతున్నాం అని మెగా తమ్ముళ్లు ఆనందంతో ఎదురుచూస్తున్నారు.   ప్రేక్షకులను ఉద్దేశించి మెగాస్టార్ చిరు ఏం మాట్లాడతారో స్పీచ్ ఏ రేంజ్ లో ఉండబోతోందో తెలియాలంటే ఇంకొన్ని గంటలో ఆగాల్సిందే.    


మరింత సమాచారం తెలుసుకోండి: