తొలి తెలుగు స్వాతంత్య్ర పోరాట యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్ర ఆధారంగా   సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో  మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా  మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన  ‘సైరా’ నిన్న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.  కాగా నెల్లూరు జిల్లాలో మెగాస్టార్ కి  మంచి మార్కెట్ ఉంది.  ఈ జిల్లాలో వసూళ్ల పరంగా మెగాస్టార్ సినిమాలు ఎప్పుడూ నిరుత్సాహా పరచలేదు. ఇక్కడ మెగాస్టార్  సినిమాలు రికార్డ్ కలెక్షన్లను కురిపిస్తాయి. తాజాగా 'సైరా' కూడా నెల్లూరులో మొదటిరోజు అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టింది.  ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం  తొలిరోజు ఈ చిత్రం నెల్లూరు జిల్లాలో రూ.2.09 కోట్ల షేర్ రాబట్టినట్టు తెలుస్తోంది.  ఈ సినిమా యొక్క జిల్లా హక్కులు రూ.4.80 కోట్లకు అమ్ముడయ్యాయి.  ఈ భారీ మొత్తాన్ని రికవర్ చేయడం కొంచెం కష్టమేనని అనుకున్నారంతా.  కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే సులభమే అనిపిస్తోంది.  ఇక చిత్రానికి పాజిటివ్ టాక్ ఉండటంతో వర్కింగ్ డేస్ అయినా కూడా వసూళ్లు బలంగానే ఉన్న వసూళ్లు వీకెండ్ సెలవుల్లో ఇంకాస్త మెరుగుపడే అవకాశం ఉంది. మొత్తానికి నెల్లూరులో సైరా దూసుకుపోతున్నాడు.     


ఇప్పటికే సైరాని చూసిన అభిమానులు ప్రేక్షకులు  'సైరా' సినిమా గురించి  సోషల్ మీడియాలో తమ  అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.  'సైరా'  'అవుట్ స్టాండింగ్'గా  అని..  అద్భుతమైన పీరియాడిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని.. దర్శకుడు సురేందర్‌ రెడ్డి  సినిమాని చాల గొప్పగా తెరకెక్కించాడని..  చిరంజీవి అద్భుతమైన నటనతో హృదయాలను కదిలించేలా నటించారని  పోస్ట్ చేస్తున్నారు.  ఖచ్చితంగా  'సైరా'  బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధించడం ఖాయం అంటున్నారు.  కాగా స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను  సురేందర్‌ రెడ్డి  కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక  బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్  మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించారు.  అలాగే ఈ సినిమాలో  సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క  వంటి స్టార్ లు కూడా  చాల బాగా నటించారు.  ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో  హీరో రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు 


మరింత సమాచారం తెలుసుకోండి: