చిరంజీవి టాప్ ఫోర్ గా ఉంటూ టాలీవుడ్ ని ఏలుతున్న ఎన్టీటీయార్, ఏయన్నార్ క్రిష్ణ, శోభన్ బాబు కాలంలో ఎంటరైన నటుడు. చిరంజీవి వచ్చేటప్పటికి సినిమా రంగంలో మెల్లగా మార్పులు వస్తున్నాయి. చిరంజీవి రావడంతో ఆ మార్పులకు తన స్పీడ్ జోడించి మొత్తం ముందుకు తిప్పేశారు. ఎన్టీయార్ పౌరాణికాలు, జానపదాలు, చారిత్రాత్మక  చిత్రాలు, సాంఘికాలు వెల్లువలా  చేశారు. మిగిలిన నటులు ఆయనలా చేయకపోయినా ఎంతో కొంత ఆయా పాత్రల్లో కనిపించి త్రుప్తి పడ్డారు.


ఇక చిరంజీవి ఎంట్రీతోనే డ్యాన్సులు, ఫైట్లు ఉంటే చాలు సినిమా హిట్ అన్న క‌ల్చర్ మొదలైంది. దాంతో పాటే చిరు కొత్త కొత్తగా డ్యాన్సులు చేసుకుపోతూ తానొక్కడి చాలు అన్ని పాత్రలు జీరో అన్నట్లుగా మూవీని తీసుకెళ్ళాడు. ఆలా ఆయన 150 సినిమాలు చేసుకునిపోయాడు. చిరంజీవి మొత్తనికి  మొత్తం చేసింది సాంఘికాలే. ఆయన ఫ్యాంట్ షర్ట్ తప్ప మేరే కాస్ట్యూమ్ లో తెరపై కనిపించలేదు తన నలభయ్యేళ్ళ సినీ జీవితంలో.


ఇపుడు సైరా నరసింహారెడ్డి పుణ్యమాని చిరంజీవి కత్తి పట్టాడు. జానపద శైలిలో  బట్టలు మార్చాడు. ఇక హిస్టారికల్ మూవీలో ఫస్ట్ టైం కనిపించి ఆ జోనర్లో తన మార్కు నటన చాటాడు. అయితే చిరంజీవి ఇన్నేళ్ళ తరువాత ఇలా కొత్త జోనర్లో నటించడం వరకూ ఒకే కానీ ఆయన నటన, డైలాగులు వంటి వాటి విషయంలో ప‌ర్ఫెక్షన్  ఉందా అన్న సందేహాలు సినీ క్రిటిక్సు నుంచి  వస్తున్నాయి. 


ఇక చిరంజీవి వరకూ బాగానే చేసినట్లున్నా ఆయా పాత్రల పోషణలో మరింతగా రాణింపు ఉండాలన్న మాట వినిపిస్తోంది. ముఖ్యంగా వాయిస్ ఖంగుమైనిపించేలా ఉండాలి. డైలాగ్  డిక్షన్ కూడా వేరే పంధాలో ఉండాలి. అభినయం తీరు కూడా ఆ జోనర్ కి సరిపడేలా ఉండాలి. ఇవన్నీ చూసుకుంటే చిరంజీవి పూర్తిగా పాత్రను పండించలేకపోయాడన్న మాట వినిపిస్తోంది. చిరంజీవి ఈ వయసులో చేశాడు అన్న సానుభూతి మనసులో పెట్టుకుని చూస్తే ఒకే కానీ ఆయా పాత్రలను అవలీల‌గా చేసిన మహానటుల ముందు చిరంజీవిని పోల్చుకుంటే మాత్రం తేలిపోయాడనే చెప్పాలంటున్నారు విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: