హిస్టారికల్ వారియర్ చిత్రం `సైరా నరసింహారెడ్డి`పై డే వన్ పాజిటివ్ టాక్ వినిపించింది. ఎమోషన్- దేశభక్తి జనాలకు కనెక్టయ్యాయన్న మాటా వినిపిస్తోంది. ఇటు ఆడియెన్ అటు క్రిటిక్స్ నుంచి పాజిటివిటీ కనిపించింది ఈ సినిమాపై. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో...


చిరంజీవి మాట్లాడుతూ...  ప‌న్నెండు సంవ‌త్స‌రాల క్రితం ప‌రుచూరిబ్ర‌ద‌ర్స్ నాకు ఈ క‌థ గురించి చెప్పారు. కాని ఈ చిత్రానికి మంచి ప్రొడ్యూస‌ర్ కావాల‌ని ఇంత కాలం వెయిట్ చేశాం. ఈ చిత్రం చెయ్య‌డం నాకు చాలా సంతోషం అనిపించింది. దాదాపుగా రెండున్న‌ర సంవ‌త్స‌రాల పాటు చాలా క‌ష్ట‌ప‌డ్డాం. మా ఈ రెండున్న సంవ‌త్స‌రాల‌పాటు ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు.  క‌థ ఎంత ముఖ్య‌మో క‌థ‌నం కూడా అంతే ముఖ్యం. హ్యాట్సాఫ్ టు సురేంద‌ర్‌రెడ్డి. మా న‌మ్మ‌కాన్ని ఒమ్ము చెయ్య‌కుండా సినిమాని ఎంతో అద్భుతంగా తెర‌కెక్కించాడు. ర‌త్న‌వేలుగారు, రాండీ న‌న్ను చాలా బాగా చూపించారు. అమితాబ్ గారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు ఆయ‌న ఎప్పుడూ కూడా ఏ విష‌యంలో మా స‌హాయం కోర‌లేదు. మా ద‌గ్గ‌ర ఏమీ ఆశించ‌కుండానే నా స్నేహితుడి కోసం ఈ సినిమా చేస్తున్నా అంటూ ఈ సినిమాలో త‌న సొంత విమానంలో వ‌చ్చి న‌టించి వెళ్లిపోయేవారు. సుబ్బ‌య్య పాత్ర‌లో చేసిన సాయిచంద్ గురించి చెప్పాలంటే అత‌ను రెండు సంవత్స‌రాలు గ‌డ్డం పెంచుకుని వేరే ఏ చిత్రంలో అవ‌కాశం వ‌చ్చినా వెళ్ల‌కుండా చాలా అద్భుతంగా డెడికేటెడ్గా న‌టించారు. ఇక జ‌గ‌ప‌తిబాబు గురించి తీసుకుంటే త‌ను చాలా డిసిప్లేన్ గ‌ల్ల వ్య‌క్తి. త‌న ప‌ని త‌ను చేసుకుని వెళ్లిపోయేవారు ఎప్పుడూ ఇబ్బందిపెట్ట‌లేదు ఆయ‌న‌కు నా కృత‌జ్ఞ‌త‌లు. కిచ్చ సుదీప్ పోల్యాండ్‌లో ఉన్నాడు. త‌ను రానందుకు సారీ చెప్పారు. ఈ సినిమా సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా ఇది ఒక ఇండియ‌న్ సినిమాగా గుర్తించి అభిమానులు దీన్ని హిట్ చేస్త‌న్నందుకు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. అలాగే సుస్మిత ఒక సూప‌ర్‌స్టార్ చెల్లెలు మెగాస్టార్ కూతురు అయినా ఎక్క‌డా కూడా గ‌ర్వం లేకుండా సెట్‌లో మ‌ట్టిలో ప్ర‌తిదీ త‌నే ద‌గ్గ‌రుండి చూసుకునేది. మా కాళ్ల‌కు చెప్పులు కూడా ద‌గ్గ‌రుండి వేసి అన్ని కాస్ట్యూమ్స్ జాగ్ర‌త్త‌గా చూసుకునేది అని అన్నారు. అనుష్క కూడా త‌న పాత్ర గురించి చెప్ప‌గానే ఏమీ ఆశించ‌కుండా అమెరికా నుంచి వ‌చ్చి యాక్ట్ వెళ్ళిపోయింది త‌న‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: