ప్లాస్టిక్ కవర్లను నిషేధిస్తూ..... ప్రాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. కవర్ల రూపంలో ప్లాస్టిక్ వినోయోగాన్ని కొంత వరకు అదుపు చేయగలిగాము.....కానీ ప్లాస్టిక్ కవర్లు తరువాత ప్లాస్టిక్ వినోయోగం ఉండేది  బ్యానర్స్ లో. పెళ్ళి, చావు,సినిమా రాజకీయం ఏదైనా సరే  పల్లెల నుండి పట్టణాల వరకు ఈ  బ్యానర్స్ సంస్కృతి పాకి అనేక సమస్యలకు కారణం అవుతుంది. 
ఈ నేపథ్యంలో చెన్నైలో జరిగిన ఓ సంఘటన అందరిని దిగ్బ్రాంతికి గురిచేసింది. 

ఓ పొలిటికల్ బ్యానర్ కారణంగా ఓ యువతి ప్రమాదానికి గురై చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘట జరిగినప్పటి నుండీ తమిళ స్టార్ హీరోలు బ్యానర్స్ కల్చర్ కి స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చారు.విజయ్, అజిత్, కమల్, రజిని, సూర్య వంటి హీరోలు తమ సినిమాలకు సంబంధించిన ఏ కార్యక్రమానికైనా బ్యానర్స్ కట్టొద్దని విజ్ఞప్తి చేసారు. ఆ డబ్బును సామజిక సేవకు ఉపయోగపడే పనులు చేయాలని తమ అభిమానులకు సూచించారు. తమ అభిమాన హీరోల విజ్ఞప్తితో అక్కడ ఫ్యాన్స్ లో మార్పు వచ్చినట్లు తెలుస్తుంది. 



కానీ  మన తెలుగు  హీరోలు ఈ విషయం పై స్పందించక పోవడం గమనార్హం.ఇటీవల విడుదలైన సాహో, గ్యాంగ్ లీడర్ మరియు గద్దలకొండ గణేష్ వంటి చిత్రాలకు అభిమానులు థియేటర్ల దగ్గర, పబ్లిక్ ప్రదేశాలలో భారీ ఎత్తున బ్యానర్స్ ఏర్పాటు చేసి తమ అభిమానం తెలుపుకున్నారు. ఇక నిన్న  విడుదలైన సైరా సంగతి సరే సరి. బీమవరంలో అభిమానులు ఏకంగా అర కిమీ మేర బ్యానెర్లతో రోడ్లను నింపేశారు. చాలా ప్రదేశాలో రోడ్ల వెంబడి బారులుగా సైరా  బ్యానర్స్ ఏర్పాటు చేశారు మెగా అభిమానులు. 


ఫాన్స్ కి ఆదర్సమ్మగా నిలవాల్సిన స్టార్ హీరోలు ఇలా పర్యావరణానికి హాని చేసే పనులను ప్రోత్సహించకూడదు.ఎన్నో రకాల పర్యావరణ ప్రమాదాలకు కారణం అవుతున్న ఇలాంటి విష సంస్కృతికి స్వస్తి చెప్పేలా ఇక నైనా మన హీరోలు అభిమానులకు పిలుపునిస్తారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: