తెలుగు చిత్ర సీమలో ఒకప్పుడు విప్లవ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు టి.కృష్ణ తనయుడు గోపిచంద్ ‘తొలివలపు’ మూవీతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.  మొదటి సినిమా యావరేజ్ టాక్ రావడంతో కెరీర్ ఇబ్బంది పడకుండా ప్రతినాయకుడి పాత్రలకు సై అన్నాడు. విలన్ గా జయం, వర్షం వంటి విజయ వంతమైన మూవీలలో ప్రతినాయక పాత్రలను పోషించాడు. తర్వాత మళ్ళీ కథానాయకుడిగా నిలదొక్కుకున్నాడు.

రణం, యజ్ఞం, శౌర్యం, శంఖం, లక్ష్యం, లౌక్యం అతను కథానాయకుడిగా నటించిన కొన్ని సినిమాలు. తండ్రి స్నేహితులైన నాగేశ్వరరావు, తిరుపతిరావు, హనుమంతరావు కలిసి గోపీచంద్ కథానాయకుడిగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తొలివలపు అనే మూవీ తీశారు.  ఈ మద్య గోపిచంద్ నటిస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.

గౌతమ్ నందా కాస్త పరవాలేదు అనిపించినా..తర్వాత వచ్చిన ఆక్సిజన్, ఆరడుగుల బుల్లెట్ , పంతం వరుసగా డిజాస్టర్స్ కావడంతో మనోడు ఆలోచనలో పడ్డాడు. దాంతో తన తర్వాతి సినిమా మంచి హిట్ కావాలనే ఉద్దేశంలో ఉన్న గోపిచంద్..'చాణక్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  స్పై థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో గోపిచంద్, అర్జున్ అనే 'రా' ఏజెంట్‌గా కనిపించనున్నాడు. బాలీవుడ్ భామ జరీన్ ఖాన్ ఇంపార్టెంట్ రోల్ చేసింది.

ఇటీవల ఈ మూవీ టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపాయి. తాజాగా గోపిచంద్ నటించిన ‘చాణక్య’ సినిమా చూసిన సెన్సార్ టీమ్.. యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. కథా కథనం, గోపిచంద్ హై ఓల్టేజ్ యాక్షన్, మెహరీన్ గ్లామర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, విజువల్స్, ఆర్ఆర్ అన్నీ హైలెట్ అయ్యాయని.. సినిమా కచ్చితంగా అలరిస్తుందని సెన్సార్ సభ్యులు చెప్పారు.  మరి ఈ సినిమాతో అయినా గోపిచంద్ జాతకం మారేనా..మంచి హిట్ కలిసి వచ్చేనా అని అంటున్నారు ఫ్యాన్స్. 



మరింత సమాచారం తెలుసుకోండి: