మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాల్లో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ సినిమాలు ఉన్నాయి. వాటిలో బ్లాక్ బస్టర్ కేటగిరీలోకి వచ్చే సినిమాల్లో ‘మాస్టర్’ సినిమా ఉంటుంది. 1997 అక్టోబర్ 3 వ తేదీన విడుదలైన ఈ సినిమాకు నేటితో 22 ఏళ్లు పూర్తయ్యాయి. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే చిరంజీవి ఇలా మాస్టర్ గా క్లాస్ లుక్ లో రావడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

 


ఈ సినిమాకు ముందు చిరంజీవి హిట్లర్ సినిమా చేశారు. మళయాళ రీమేక్ వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి ఐదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా, కుటుంబ బాధ్యతలు మోసే ఇంటి పెద్దగా పెద్దరికపు క్యారెక్టర్ చేశారు. మాస్ హీరో చిరంజీవి ఇలాంటి మేకోవర్ లోకి మారిపోవటానికి క్యారెక్టర్ ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేయాలనే ఆయన డెసిషనే కారణం. చిరంజీవి సాఫ్ట్ క్యారెక్టర్స్ చేయడాన్ని అభిమానులు ఒప్పుకుంటారా అనే సందేహాలకు ఈ సినిమాలే సమాధానం చెప్పాయి. ఆయన కథలను ఎంచుకున్న  విధానం అభిమానులను మెప్పించింది. హిట్లర్, మాస్టర్ సినిమాల్లో చిరంజీవి క్యారెక్టర్ సాఫ్ట్ గా ఉన్నా సూపర్ హిట్ అయ్యాయి. కళ్లజోడు పెట్టుకుని విద్యార్ధులకు తెలుగు పాఠాలు చెప్పే మాస్టర్ గా చిరంజీవి నటించి సినిమాకు స్టైలిష్ లుక్ ఇచ్చారు. సెకండాఫ్ లో స్టూడెంట్ గా, లవర్ గా యూత్ కు కనెక్ట్ అయ్యే పాత్రలో నటించి మెప్పించారు.

 

 

డీటీఎస్ సౌండ్ మిక్సింగ్ లో వచ్చిన తొలి తెలుగు సినిమా మాస్టర్. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకు తమిళ దర్శకుడు సురేశ్ కృష్ణ దర్శకత్వం వహించారు. 53 సెంటర్లలో 100 రోజులు, విజయవాడ, కాకినాడల్లో 175 రోజులు ప్రదర్శితమై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: