మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సినిమా సైరా నరసింహారెడ్డి విపరీతమైన అంచనాలతో రిలీజ్ అయి, ఓవర్ ఆల్ గా యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బ్రిటిష్ పాలకులపై తొలిసారి తిరగబడ్డ విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై టాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. అయితే తొలి రోజు తొలి ఆట చూసిన ప్రేక్షకులకు సైరా ఆశించినంత సంతృప్తిని ఇవ్వలేదనే టాక్ వెలువడింది. 

తెరపై అత్యద్భుతమైన విజువల్స్, సెట్టింగ్స్, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్ వంటివి ఉన్నప్పటికీ, సగటు ప్రేక్షకుడు ఆశించే ఎంటర్టైన్మెంట్స్ వంటి కొన్ని అంశాలు ఈ సినిమాలో మిస్ అయినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కువ శాతం సినిమాని మంచి ఎమోషనల్ గా నడిపిన దర్శకుడు సురేందర్ రెడ్డి, సినిమా స్క్రీన్ ప్లే పై మరింత శ్రద్ద పెట్టి ఉంటె బాగుండేది అనే టాక్ విపరీతంగా వినపడుతోంది. ఇక తన కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఎంతో సహజమైన నటనను కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అనే చెప్పాలి. ఇక కాసేపటి క్రితం జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్ లో రైటర్ పరుచూరి గోపాల కృష్ణ గారు మాట్లాడుతూ, 

ఈ సినిమా కోసం మెగాస్టార్ గారితో పాటు నిర్మాత చరణ్ కూడా ఎంతో తపించాడని, అలానే సినిమా ఖర్చు విషయమై అతడు ఒక రూపాయిని, పైసా మాదిరిగా ఏ మాత్రం ఆలోచించకుండా ఖర్చు పెట్టడం జరిగిందని అన్నారు. అయితే సినిమాపై అంత భారీ ఖర్చు చేయడం దేనికంటే, సినిమాలో క్వాలిటీ ఎక్కడా ప్రేక్షకులు మిస్ కాకూడదనే ఉద్దేశ్యంతో చరణ్ అంత ఖర్చు పెట్టారని అన్నారు. ఇక రెండవ రోజు ఈ సినిమా ఆశించినంత కలెక్షన్స్ మాత్రం దక్కించుకోలేదంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత మేర కలెక్ట్ చేస్తుందో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: