సౌత్ లో క్రేజీ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ ఇప్పటికి సూపర్ ఫాం లో ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఆ సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన సీత వరకు సత్తా చాటుతూ వస్తుంది. స్టార్ సినిమా.. యువ హీరో సినిమా అనే తేడా లేకుండా ఆమె నటిస్తుంది.


ఇక ఈమధ్య ఏ ప్రెస్ మీట్ కు వెళ్లినా సరే మీడియా వాళ్లు తన పెళ్లి గురించి అడుగుతున్నారని ఫీల్ అవుతుంది కాజల్. తన మనసుకి నచ్చిన వాడు ఇంకా దొరకలేదు. తనని తనలా అర్ధం చేసుకునే వాడు తనకు భర్తగా రావాలని. అలాంటోడి కోసం తాను ఎదురుచూస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది కాజల్.


ప్రస్తుతం కాజల్ తెలుగు, తమిళ, హింది భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్ తమిళ రీమేక్ లో నటించింది కాజల్. అంతేకాదు హిందిలో కాల్ సెంటర్, ముంబై సాగాతో పాటుగా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2 సినిమాలో కూడా ఆమె నటిస్తుందని తెలిసిందే.


థర్టీ ప్లస్ ఏజ్ వచ్చినా ఇప్పటికి క్రేజీ హీరోయిన్ గా ఛాన్సులు కొట్టేస్తున్న కాజల్ తప్పకుండా మరో రెండు మూడేళ్లు సినిమాలు చేశాకనే పెళ్లి చేసుకుంటుందని కొందరు అంటున్నారు. ఎలాగు క్రేజ్ ఉంది కాబట్టి ఫాం కోల్పోయిన టైంలో పెళ్లి చేసుకునే ఆలోచన చేస్తుందేమో. ఇప్పటికైతే తనకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పేసింది కాజల్. టాలీవుడ్ లో చందమామకు మరో ఐదేళ్ల వరకు తిరుగు లేదని చెప్పొచ్చు. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా ఆమెకు వరుస అవకాశాలు ఇస్తున్నారు. తప్పకుండా ఆమె మనసు గెలిచే కుర్రాడు త్వరలోనే దొరకాలని ఆశిద్దాం.  



మరింత సమాచారం తెలుసుకోండి: