కొత్త సినిమాలకు టాక్ బాగున్నా కలెక్షన్లు డల్ గా ఉంటాయి. నేచురల్ స్టార్ నాని సినిమాలకు కొన్నాళ్లుగా ఇలాంటి బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ ఎదురవుతోంది. ఈ యంగ్ హీరో సినిమాలకు హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం రావడం లేదు. మౌత్ టాక్ బాగున్నా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం హిట్ అనిపించుకోవడం లేదు. 


యంగ్ హీరో నాని నిఖార్సైన హిట్ కొట్టి రెండేళ్లు దాటుతోంది. నేను లోకల్ సినిమా తర్వాత నాని నటించిన ఏ సినిమా కూడా హిట్ రేంజ్ కు వెళ్లలేదు. ఈ మధ్య నాని సినిమాల రిజల్ట్ చూస్తే అసలు హిట్ అనాలా ఫ్లాప్ అనాలా అర్థం కాకుండా అయిపోయింది. నేను లోకల్ తర్వాత నాని నటించిన నిన్ను కోరి  పర్వాలేదనిపించుకుంది. ఎం.సి.ఎ సినిమా కూడా అదే పరిస్థితి. 


శ్రీకృష్ణార్జున యుద్దం తర్వాత నాని సినిమాలు వరుస పెట్టి బయ్యర్లను ముంచేస్తున్నాయి. శ్రీకృష్ణార్జున యుద్ధం డిజాస్టర్ గా మిగిలింది. నాగార్జునతో కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ దేవదాస్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక ఈ ఏడాది నటించిన జెర్సీ సినిమా సూపర్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లు మాత్రం అంతంత మాత్రంగానే వచ్చాయి. అతికష్టంగా జెర్సీ సేఫ్ జోన్ కు చేరింది. ఇపుడు గ్యాంగ్ లీడర్ సినిమాకు కూడా అలాంటి సిట్యుయేషన్ ఎదురైంది. 

రీసెంట్ గా  రిలీజైన నాని కొత్త సినిమా గ్యాంగ్ లీడర్ కు మంచి టాక్ వచ్చింది. కానీ కలెక్షన్లు మాత్రం లేవు. విక్రమ్ కుమార్ లాంటి డైరెక్టర్ కూడా నానికి సూపర్ సక్సెస్ అందించలేకపోయాడు. అయితే నాని ఒకే రకమైన సినిమాలు చేయడం సక్సెస్ కు దూరమయ్యాడమే టాక్ ఉంది. నాని యాక్టింగ్ తో మెప్పిస్తున్న స్టోరీలో కంటెంట్ మిస్ అవుతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న ఏ సినిమాతో అయినా నాని సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో  చూడాలి. 




మరింత సమాచారం తెలుసుకోండి: