నిన్న జరిగిన ‘సైరా’ సక్సస్ మీట్ లో జరిగిన ఒక అనుకోని సంఘటనకు  మీడియా వర్గాలతో పాటు చిరంజీవి కూడ షాక్ అయ్యాడు. ఇప్పటి తరం యంగ్ హీరో హీరోయిన్స్ మధ్య చాల సాన్నిహిత్యం ఉంటోంది అన్న విషయం ఓపెన్ సీక్రెట్ అయినా నిన్నటి మీడియా మీట్ లో తమన్నా చరణ్ ను చనువుగా ‘రా’ పిలవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. 

ఈ మూవీలో నటించే అవకాశం తనకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ యూనిట్ సభ్యులు అందరి గురించి పేరుపేరునా ప్రస్తావిస్తూ చరణ్ దగ్గరకు వచ్చే సరికి తమన్నా ఎవరు ఊహించని పదం వాడింది. ‘చరణ్ నువ్వు కో యాక్టర్ గా బెటర్ నా ప్రొడ్యూసర్ గా బెటర్ నా ఏం చెప్పాలి రా’ అంటూ కామెంట్ చేసింది. ఈ మాట తమన్నా నోటివెంట రాగానే ఆ మీడియా మీట్ కు వచ్చిన వారంతా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. 

అయితే చిరంజీవి మాత్రం నవ్వకుండా గంభీరంగా కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా తమన్నా మాటలకు చిరంజీవి షాక్ అయ్యాడా అనే విధంగా ఆయన కనిపించాడు. అయితే ఈ విషయాలు ఏమి పట్టించు కోకుండా రామ్ చరణ్ మాత్రం తమన్నా మాటలను ఓపెన్ గానే తెగ ఎంజాయ్ చేసాడు. 

అయితే ఆ తరువాత మైక్ ముందుకు వచ్చిన చరణ్ మాట్లాడుతూ తమన్నా అనబోయి నయనతార అని అనడంతో ఆమె విపరీతంగా నవ్వింది. ఆ నవ్వును తమన్నా ఎంతకు ఆపక పోవడంతో ‘నువ్వు నవ్వడం ఆపితే నేను మాట్లాడుతా’ అంటూ చిన్నగా చురకలు వేసాడు. దీనితో ఈ మీడియా మీట్ ను కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులు మాత్రం చరణ్ తమన్నాల ఇంత సాన్నిహిత్యం ఉందా అంటూ జోక్ చేసుకున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: