పాయల్ రాజ్ పుత్.. మళ్లీ సెగలు రేపుతోంది. హాట్ ఫోజులతో అదరగొడుతోంది. ఈమె సినిమా ఆర్డీఎక్స్ లవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా పింక్ గౌను వేసుకుని హాట్ పోజు ఇచ్చింది. ముఖంలో అమాయకత్వం వలకబోస్తూనే.. అందాల ప్రదర్శన కొనసాగించింది. అసలే పొడుగు భామ.. అందులోనూ గౌను వేసింది.


ఆమె తాజా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో పెట్టిన ఈ ఫోటోలకు తెగ కామెంట్లు వస్తున్నాయి. ఇక ఆర్ డీఎక్స్ లవ్ సినిమాలోనూ అమ్మడి అందాలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇక తన తాజా చిత్రం ఆర్డీఎక్స్ లవ్ గురించి చెప్పాల్సి వస్తే.. . ఈ సినిమా ప్రమోషన్ మొదటి నుంచి కూడా హీరోయిన్ రాజ్ పుత్ అందాల ప్రదర్శన ఆధారంగానే సాగింది.


ఆరెక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్ పుత్ కు వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకే ఈ సినిమా నిర్మిస్తున్నారా అన్నట్టు అనిపించింది. ఈ సినిమా యూనిట్ ప్రమోషన్ కూడా అదే రేంజ్ లో వస్తోంది. మొదట్లో పాయల్ రాజ్ పుత్ ను ఓ అందాల నెరజాణగా చూపిస్తూ పోస్టర్లు రిలీజ్ చేశారు. కేవలం పాయల్ రాజ్ పుత్ అందాలనే పెట్టుబడిగా పెట్టి సినిమా తీస్తున్నారా అనిపించారు.


ఆ తర్వాత వచ్చిన టీజర్లోనూ అంతా బూతు కామెడీయే పెట్టడంతో ఇదేదో అడల్డ్ కామెడీ మూవీ అనిపించారు. కానీ ఇది ఓ ఊరి కోసం తీసిన సినిమా అట. కామాంధులవేట అణిచేందుకు ఓ అమ్మాయి సాగించిన వేటగా ఈ సినిమా స్టోరీ చెప్పుకోవచ్చు.. ఓ సీరియస్ స్టోరీకి సుగర్ కోటెడ్ గా పాయల్ రాజ్ పుత్ అందాలను వాడుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ వ్యూహం కరెక్టా కాదా అన్నది సినిమా చూస్తే కానీ తెలీదు.


మరింత సమాచారం తెలుసుకోండి: