సైరా మూవీ అంటేనే మెగాస్టార్ అన్న భావన ఉంటుంది. ఎందుకంటే ఆయన టైటిల్ రోల్ పోషించారు. చిత్రం మొత్తం కనిపిస్తారు. స్క్రీన్ షేర్ చూస్తే మెగాస్టార్ నూటికి ఎనభై శాతం ఆక్రమించేశారు. కాబట్టి సైరా అణువణువు మెగాస్టార్ నటన కనిపిస్తుంది. అయితే స్క్రీన్ షేర్లో ఎక్కువ ఆక్యుపెన్సీ ఎవరు అన్నది పక్కన పెడితే ఒక నిముషం తెరపై కనిపించినా అద్భుతంగా నటించిన వారు కూడా ఉన్నారు. అటువంటి ఒక నటుడు గురించి ఇక్కడ చెప్పుకోవాలి.


త్రిపురనేని సాయిచంద్ అనే నటుడు ఎర్లీ ఎయిటీస్ లో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ప్రముఖ రచయిత త్రిపురనెని గోపీచంద్ కుమారుడు. చిరంజీవితో ఆ రోజుల్లోనే ఆయన మంచుపల్లకి మూవీలో కనిపిస్తారు. తరువాత హీరోగా కూడా కొన్ని మూవీస్ చేశారు. గుడిగంటలు మోగాయి. పుణ్య భూమి కళ్ళు తెరచింది వంటి మూవీస్ లో అతని నటనకు అప్పట్లో మంచి పేరు వచ్చింది.


ఇంతటి మంచి నటుడు కొన్ని దశాబ్దాలుగా తెరమరుగు అయ్యాడు. ఆయన్ని వెతికి పట్టుకుని మళ్ళీ నటింపచేసిన ఘనత మాత్రం శేఖర్ కమ్ములకే దక్కింది. ఫిదా మూవీలో ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా తెలంగాణా యాస పండిస్తూ సాయిచంద్ చేసిన పాత్ర అదుర్స్. ఇక సైరాలో కూడా ఆయన ఓ సామాన్య రైతుగా నటించిన తీరు బ్రిటిష్ వారిని ఎదిరించిన వైనం కూడా గగ్గుర్పాటు కలిగిస్తాయి.


చావు అంటే ఇదిరా అంటూ బ్రిటిష్ వారి చేతిలో మరణిస్తూ సాయిచంద్ అన్న డైలాగులు సినిమాహాల్లో అందరినీ ఓ ఎమోషనల్ ఫీల్ లోకి తీసుకువెళ్తాయి. ఇక సాయిచంద్ ఈ సినిమాలో కనిపించింది తక్కువ అయినా తన వంతు నటనతో దేశభక్తి రంగరించడానికి సైరా నరసింహారెడ్డి లో ఆ తీవ్రత, కసి రగిలించడానికి క్రుషి చేసిన  ఓ సాధనంగా కనిపిస్తారు. అంటే ఒక బ్యాక్ బోన్ గా సాయిచంద్ సైరాలో  నిలిచారన్న మాట. అందువల్ల సాయిచంద్ అద్భుతమైన నటనను సైరా చూసిన ప్రతీవారు ఇపుడు గుర్తు చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: