సైరా సినిమా కథను పరుచూరి బ్రదర్స్ అందించిన విషయం తెలిసిందే. అయితే ఒకవేళ చిరంజీవి సైరా సినిమా చేయకపోతే ఎవరు చేసేవాళ్ళు అనే విషయాన్ని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు . చిరంజీవి 151 చిత్రంగా  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తొలి తెలుగు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన  ఈ చిత్రనికి  సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అయితే ఎన్నో వ్యయప్రయాసలకోర్చి చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మించారు. 

 

 

 

 

 అయితే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఏకంగా ఒకేసారి ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్  తో దూసుకుపోతోంది. అయితే మెగాస్టార్ చిరంజీవి కి ఆయన  కెరీర్లో ఎన్నో విజయాలు ఉన్నప్పటికీ ... తన సినీ కెరీర్ లోనే డ్రీమ్  ప్రాజెక్ట్ గా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా విజయంతో చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. ఇంత  మంచి సినిమాను తనకు అందించిన తనయుడు రామ్ చరణ్ కు కృతజ్ఞతలు తెలిపాడు చిరంజీవి. తాజాగా సక్సెస్ మీట్ ను కూడా ఏర్పాటు చేసింది చిత్ర బృందం.

 

 

 

 

 అయితే ఈ సందర్భంగా సైరా నరసింహారెడ్డి ని కథను అందించిన పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియ జేశాడు. సైరా సినిమా కథను  2004లోనే మెగాస్టార్ చిరంజీవి తో ఈ సినిమా చేయాలనుకున్నామని... కానీ ఆ తర్వాత చిరంజీవి 2008లో రాజకీయాల్లో ప్రవేశించడంతో సినిమా వాయిదా పడిందన్నారు. అయితే ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్న చిరంజీవి... ఈ సినిమా నాతో కాకపోయినా రామ్ చరణ్ తో తెరకెక్కిద్దాం అని చిరంజీవి  మాతో  తో  అప్పట్లో చెప్పారని  పరుచూరి గోపాలకృష్ణ చెప్పాడు. అయితే చిరంజీవి రాజకీయాల్లోనే కొనసాగి ఉంటే సైరా నరసింహారెడ్డి సినిమా రామ్ చరణ్ చేసేవారని పరుచూరి గోపాలకృష్ణ మాటల్లో అర్ధం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: