తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో  టాలీవుడ్ యాక్షన్ హీరో  గోపీచంద్ హీరోగా  వస్తోన్న యాక్ష‌న్  స్పై   థ్రిల్ల‌ర్ 'చాణ‌క్య‌'.  కాగా రేపు ఈ సినిమా  గ్రాండ్ గా విడుదల కానుంది. అయితే   ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ ఉన్నప్పటికీ మెగాస్టార్ 'సైరా' బాక్స్ ఆఫీస్ ముందు భీభత్సం సృష్టిస్తోంది.  వర్కింగ్ డేస్ లోనే చిత్రం రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.  అలాంటిది శని, ఆదివారాల్లో సినిమా ప్రభావం బాక్స్ ఆఫీస్ మీద మరింతగా ఉంటుంది.  కాబట్టి ఆ రోజుల్లో ఏ మీడియం సినిమా విడుదలైనా ఓపెనింగ్స్ పరంగా తీవ్రమైన ఇబ్బంది తప్పదు.  ఇప్పుడు 'చాణక్య'కి కూడా ఈ బెడద ఖచ్చితంగా ఉంటుంది.  అంతేకాదు సినిమాకు తొలిరోజు మంచి మౌత్ టాక్ వస్తే తప్ప లాంగ్ రన్ కష్టం.  మరి ఈ ఇబ్బందుల్ని 'చాణక్య' ఎలా అధిగమిస్తాడో చూడాలి. 

అయితే  సైరా లాంటి భారీ బడ్జెట్ మూవీతో   చాణక్య పోటీగా ఎందుకు వస్తున్నాడని మీడియా గోపీచంద్ ను అడగగా.. ఈ విషయం గురించి  గోపీచంద్ మాట్లాడుతూ..  'నిజానికి చాణక్య మూవీని మేము  'మే' నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నామని,  కానీ,  నేను గాయపడిన తరువాత షూటింగ్ ఆలస్యం అయింది.  ఇక ఆ తరువాత,  అక్టోబర్ 3న మా సినిమాను విడుదల చేయాలనుకున్నాము,  అప్పటికీ   సైరా విడుదల తేదీ ప్రకటించలేదు.  ఇక సైరా  అక్టోబర్ 2 విడుదల అని ప్రకటించాక,  మేము అక్టోబర్ 5న చాణక్య రిలీజ్ ప్లాన్ చేశాము. అయితే దసరా హాలిడేస్ కాబట్టి  చాణక్యను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. పైగా  చాణక్య మరియు సైరా  రెండు సినిమాలు వేరు వేరు నేపథ్యాలకి సంబంధించినవి' అని గోపిచంద్ చెప్పారు.  

ఇక ఈ సినిమాలో ఫ్యామిలీస్ కోరుకునే ఎంటర్ టైన్మెంట్ తో  పాటు మంచి యాక్షన్ కూడా ఉందని  అలాగే సినిమాలో మంచి ఎమోషన్ కూడా ఉందని  ఆ ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని గోపీచంద్ చెప్పుకొచ్చాడు.  కాగా వరుసగా మూడు సినిమాలు పరాజయం చెందడంతో రేపు శనివారం విడుదలకానున్న 'చాణక్య' మీదే ఆశలు పెట్టుకున్నాడు గోపిచంద్.  ఈ సినిమాలో  గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్‌ గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తోన్న రెండో చిత్రమిది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  ఈ సినిమాలో గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్‌ లో కనిపించనున్నారు.   ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర  నిర్మిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: