టాలీవుడ్‌ క్రేజీ హీరో  విజయ్‌ దేవరకొండ   హీరోగా మరియు నిర్మాతగా వ్యవహరిస్తున్నా.. అటు బిజినెస్ మేన్ గానూ  ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా చాల కూల్ గా హ్యాండిల్ చేస్తున్నాడు.  తన ఫ్యాషన్ బ్రాండ్ ‘‘రౌడీ వేర్’’ కోసం చేసిన ఫొటోషూట్ స్టిల్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి.  తన యాట్యిటూడ్ తో యూత్ లో బలమైన ముద్రను వేసిన విజయదేవరకొండ ఫ్యాషన్ ప్రపంచానికి రౌడీ బ్రాండ్ తో స్టైయిల్ స్టెట్మెంట్ గా మారాడు. ప్రత్యేకత, నాణ్యత, భారతీయతను మేళవించి రౌడీ బ్రాండ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసింది.  ఒక సెలబ్రిటీ ఇమేజ్ తో నడుస్తున్న తొలి బ్రాండ్ ఇదే కావడం విశేషం. తన స్టైయిల్ స్టెట్ మెంట్స్ తో తన ప్యాషన్ అభిరుచితో రౌడీ బ్రాండ్ అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రౌడీ బ్రాండ్ ఫుట్ వేర్ ప్రొడక్ట్స్ లోకి కూడా తన మార్క్ ని చూపబోతుంది.  త్వరలోని విస్తరించబోతున్న ‘స్ట్రీట్ వేర్’ బ్రాండ్  ఫుట్ వేర్ రంగంలో కొత్త వాయిస్ గా మారబోతుంది. 


ఇక తన బ్రాండ్స్ కోసం చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ లో విజయ్ దేవరకొండ న్యూ లుక్ తో ఇంటర్నెట్ లో సందడి చేస్తున్నాడు. ప్రసుతం విజయ్ దేవరకొండ లుక్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సారి విజయ్ దేవరకొండ హెయిర్ స్టైల్ మార్చడంతో లుక్ చాల బాగుంది.  అయితే  విజయ్‌ దేవరకొండ ఈ న్యూ లుక్‌  సినిమా కోసం కాదు, కేవలం తన బ్రాండ్స్ ప్రమోషన్ కోసమే. ఇక విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన గత సినిమా డియర్‌ కామ్రేడ్‌ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కానీ  విజయ్‌ దేవరకొండ మాత్రం తన తదుపరి సినిమాల షూటింగ్‌ లతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే  వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ మూవీ షూటింగ్  చాల వరకూ పూర్తి చేసిన విజయ్.. ఈ మూవీ తరువాత పూరి 'ఫైటర్' మూవీ కోసం సిద్ధం కానున్నాడు. 


Image



Image


మరింత సమాచారం తెలుసుకోండి: