తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ ఈ నెల 2న గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కొణిదెల రామ్ చరణ్ నిర్మించారు.  ఈ మూవీ రిలీజ్ అయిన సెంటర్లలో యావరేజ్ టాక్ వచ్చినా..కొన్ని చోట్ల కలెక్షన్లు మంచి కలెక్షన్లు రాబడుతుంది.  ఏది ఏమైనా చిరంజీవికి ఉన్న క్రేజ్ తెలుగు లో పనికి వచ్చినా.. కన్నడ,మళియాళ, హిందీలో మాత్రం కలిసి రాలేదు.  


అయితే సైరా మొదలు పెట్టినప్పటి నుంచి ఎన్నో అవరోధాలు దాటుకుంటూ వస్తుంది. ఈ మూవీ షూటింగ్ లో అవరోధాలు.. ఉయ్యాలవాడ కుటుంబ సభ్యుల గొడవలు ఎన్నో రకాలు ఇబ్బందులు ఎదుర్కొని..కోర్టులో క్లియరెన్స్ తీసుకొని రిలీజ్ అయ్యింది.  ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తాయి.  ఈ మూవీ కమర్షియల్ గా తీశారని..ఒక యోధుని గురించి చెప్పాల్సిన కథ చెప్పలేదని విమర్శలు వచ్చాయి.  తాజాగా సైరాకు మరో కష్టం వచ్చిపడింది.  అయితే ఇది ఇక్కడ కాదు..‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ప్రదర్శనను కెనడాలోని టొరొంటోలో నిలిపివేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ ఒంటారియోలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల కారణంగా చిత్ర ప్రదర్శనను నిలిపివేసినట్టు సమాచారం.


ఈ మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్  కిచెనెర్‌లోని ‘ల్యాండ్‌మార్క్ సినిమాస్‌’లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా కత్తి తీసి తెరను చించేశాడు. అనంతరం ప్రేక్షకులపైకి పెప్పర్ స్ప్రేను వెదజల్లి పరారయ్యాడు. దీంతో వారు భయాందోళనకు గురై పరుగులు తీశారు.  విట్బీలోనూ ఇటువంటిదే మరో ఘటన జరిగింది. ‘సైరా’మూవీ ప్రదర్శిస్తున్న వేర్వేరు ప్రాంతాల్లో ఇటువంటివే మరికొన్ని ఘటనలు జరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా సినిమా ప్రదర్శనను నిలిపివేసినట్టు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: