కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్‌ జంటగా నటించిన చిత్రం ' రాజావారు రాణిగారు'. ఎస్‌.ఎల్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా 9పతాకాలపై మనోజ్‌ వికాస్‌ డి., మీడియా 9 మనోజ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'రాజావారు రాణిగారు' ఇప్పటికే టీజర్‌ ద్వారా ప్రజలకు చేరువైంది. విడుదలైన మూడు పాటలు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.  ఈ కార్యక్రమం లో ప్రముఖ నటి శ్రేయ శరన్ , మాళవిక శర్మ, డి . సురేష్ బాబు, తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ తదితరులు పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పోస్టర్‌, పాట విడుదల కార్యక్రమం జరిగింది. డి. సురేష్‌బాబు ఆవిష్కరించారు. 


అనంతరం సురేష్ బాబు  మాట్లాడుతూ.. మనసులోని ప్రేమని ఎన్ని రకాలుగా చెప్పవచ్చో అనే అంశంతో తీసిన సినిమా నాకు నచ్చింది. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఓ అనుభూతికి గురవుతారని' పేర్కొన్నారు. 'ప్రేమమ్‌ తర్వాత అంతటి గాఢత కనిపించిన సినిమా ఇదేనని' తరుణ్‌భాస్కర్‌ అన్నారు. 
చిత్ర దర్శకుడు రవికిరణ్‌ కోలా మాట్లాడుతూ.. పల్లెటూరిలో పుట్టి పెరిగిన వాళ్ళకు తమ జ్ఞాపకాల్ని గుర్తు చేసే చిత్రమిది. పట్నంలో ఉన్నవాళ్ళ్కకు పల్లెటూరు ఎలా వుంటుందో రెండుగంటల్లో కళ్ళకు కట్టిన్లు ఆవిష్కరించే చిత్రమిది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు. 


 హీరో మాట్లాడుతూ.. మళ్ళీశ్వరి సినిమాను మా కుటుంబంతో చూశాం. ఈ రోజు మా సినిమాకు సురేష్‌బాబుగారు సపోర్ట్‌ చేయడం చాలా ఆనందంగా వుంది. 21 సంవత్సరాల కుర్ర నిర్మాత మా చిత్రాన్ని నిర్మించడం మరింత సంతోషం. దర్శకుడు రవి అద్భుతంగా తెరకెక్కించారని తెలిపారు.


శ్రియ మాట్లాడుతూ.. సురేష్‌బాబుగారు ఈ సినిమాను విడుదల చేయడం మాకు ధైర్యాన్నిచ్చింది. మంచి సినిమాగా పేరుతెచ్చుకుంటుందని ఆశిస్తున్నాను అన్నారు. 
మాళవిక శర్మ మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి విన్నాను చాలా చక్కగా చేసారని తెలిసింది సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తుంది అంటేనే సినిమా హిట్ అని లెక్క.. చక్కటి పల్లెటూరి ప్రేమకథ గా ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకోవాలని కోరుకుంటున్నాను..  అన్నారు.


విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. నేను చిన్నప్పుడు ఆంధ్ర లోని పల్లెట్టూర్లకి వెళ్ళాను చాలా చక్కగా ఉంటాయి మల్లి సిటీ అలవాటు అయ్యాక పెద్దగా వెళ్ళలేదు.. ఈ సినిమా చూస్తే నాకు అన్ని గుర్తొచ్చాయి .. అందరికి వాళ్ళ అమ్మమ్మ  గారి ఇల్లు గుర్తొస్తాయి  అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: