బీ టౌన్ కింగ్ ఖాన్ బౌన్స్ కోసం ఆ సీరీస్ నే నమ్ముకున్నాడా?  సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు బాలీవుడ్ బాద్ షా చేస్తున్న ప్రయత్నం ఏంటి?  చాలా కాలంగా బ్లాక్ బస్టర్ తో వెయిట్ చేస్తున్న షారుఖ్ ఖాన్ ఆశలను హాలీవుడ్ రీమేక్ నిజం చేస్తుందా? 


బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కెరీర్ డైలమాలో పడింది. ఈ స్టార్ హీరో ఆరేళ్లుగా సక్సెస్ కోసం చేయని ప్రయోగాలు లేవు. ఎన్నో ఎక్స్ పర్ మెంట్స్ చేసిన షారుఖ్ ని సక్సెస్ మాత్రం వరించలేదు. చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాతో బాలీవుడ్ రికార్డ్స్  తిరగరాసిన కింగ్ ఖాన్ ఆ స్థాయి హిట్ కోసం ఆరేళ్లుగా బాక్సాఫీస్ వద్ద పోరాటం చేస్తూనే ఉన్నాడు. దీంతో షారుఖ్ తనకు అచ్చొచ్చిన సీక్వెల్ తో సక్సెస్ కొట్టడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 


నిజానికి ఈ ఆరేళ్లలో షారుఖ్ ఖాన్ ఫ్యాన్, రాయిస్, జీలో లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేశాడు. అలాగే దిల్ వాలే, డియర్ జిందగీ, జబ్ హ్యారీ మెట్ సెజల్ లాంటి తన మార్క్ మూవీస్ కూడా చేశాడు. అయినా కూడా ఈ స్టార్ హీరోకు సక్సెస్ మాత్రం ఇటీవల దక్కలేదు. షారుఖ్ సిన్సియర్ గా ట్రై చేసినా రిజల్ట్ మాత్రం తేడా కొడుతోంది. దీంతో కింగ్ ఖాన్ తనకు బాగా అచ్చొచ్చిన డాన్ సిరీస్ డాన్ 3 సీక్వెల్ లో నటించేందుకు రెడీ అవుతున్నట్టు వినిపిస్తోంది.


డాన్ 3 సీక్వెల్ తో పాటు ధూమ్ 4 సీక్వెల్ లో నటించేందుకు బీటౌన్ బాద్ షా ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు సీక్వెల్స్ మాత్రమే కాకుండా హాలీవుడ్ చిత్రం కిల్ బిల్ రీమేక్ పై ఫోకస్ చేస్తున్నట్టు బీటౌన్ సర్కిల్ లో టాక్స్ నడుస్తున్నాయి. ఈ సినిమాలకు సంబంధించి రెండు మూడు నెలల్లో అఫిషియల్ స్టేట్ మెంట్ వస్తోందని సమాచారం. ఈ సీక్వెల్స్ తో అయినా షారుఖ్ తిరిగి పూర్వవైభవం అందుకుంటాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: