ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన పేరు జార్జి రెడ్డి.  సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జిరెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తోంది.   హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ.. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగాడు జార్జిరెడ్డి. అలాంటి ఆదర్శనీయమైన విద్యార్థి నేత బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. జీవన్ రెడ్డి దర్శకత్వంలో రానున్న  ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం.   ఈ ట్రైలర్ లో జార్జ్ రెడ్డి సినిమా బయోపిక్ అయినా కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి.  ఒక కమర్షియల్ హీరో తెరమీర చేసే సాహసాలన్నీజార్జ్ నిజజీవితంలో చేసినట్టు ఈ ట్రైలర్ ను చూస్తే అర్థమవతుంది. చరిత్ర మరిచిపోయిన లీడర్ అనే విషయాన్ని  ట్రైలర్ లో బాగా హైలెట్ చేశారు.  ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ప్రసుతం ట్రెండింగ్ లో ఉంది.     

ఒక కమర్షియల్ హీరో తెరమీర చేసే సాహసాలన్నీజార్జ్ నిజజీవితంలో చేసినట్టు ఈ లుక్ ను చూస్తే అర్థమవతుంది. చరిత్ర మరిచిపోయిన లీడర్ అనే విషయాన్ని పోస్టర్ లో నే చెప్పారు. 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్సీటీలో చదువుకున్న ప్రతీ విద్యార్థికి జార్జ్ జీవితం గురించి తెలుసు. కానీ ఈ తరానికి జార్జ్ లాంటి టెర్రిఫిక్ లీడర్ గురించి తెలుసుకునే విదంగా ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. మొత్తంగా ఓ ఫర్ గాటెన్ లీడర్ కథను తీసుకు వస్తోన్న ఈ టీమ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఒక్కసారిగా సినిమాపై ఆసక్తిని పెంచింది. 1960, 70 లలో రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను కల్లకు కట్టబోతున్న ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్ తో కలిసి త్రీ లైన్స్, ‘‘సిల్లీ మాంక్స్ స్టూడియో’’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘‘వంగవీటి’’ఫేం సందీప్ మాధవ్  (సాండి) ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుండగా, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, తిరువీర్, అభయ్, ముస్కాన్, మహాతి ఇతర నటీనటులు. ప్రముఖ హీరో సత్య దేవ్ కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. ప్రముఖ మరాఠీ నటి దేవిక ‘‘జార్జి రెడ్డి’’ తల్లి పాత్రలో నటిస్తుండటం విశేషం.   

సాంకేతికవర్గానికి విషయానికి వస్తే. సంచలనాత్మక మరాఠి సినిమా ‘‘సైరాత్’’  ఫొటోగ్రఫీని, ఇటీవల మరాఠి బ్లాక్ బస్టర్  ‘‘నాల్’’ కు దర్శకత్వంవహించిన సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు ఫొటోగ్రఫిని అందించారు. ఈ చిత్రాన్ని మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి సిల్లీ మంక్స్, త్రీ లైన్స్సినిమా బ్యానర్లతో కలిసి నిర్మిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: