మంచు లక్ష్మీ.. ప్రస్తుతం సినీ తారలతో ఓ ఇంటర్వ్యూ చేస్తోంది. ఫీట్ అప్ విత్ స్టార్స్ అనే ఈ షో వూట్ అనే యాప్లో ప్రసారం అవుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ కు , మంచు ఫ్యామిలీ మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే.  పైగా మంచు లక్ష్మీతో గట్టి స్నేహ బంధం ఏర్పడింది. దీంతో ఈ షోను హోస్ట్ చేస్తుంది తన ఫ్రెండే కాబట్టి.. ఎవరికీ తెలియని సీక్రెట్స్ చెప్పుకొచ్చింది.


 తనకు కాబోయే వాడేలా ఉండాలి? అని అడగగా అతనికి చాలా తెలివి ఉండాలి అని, ఆరడుగులకు కొంచెం తక్కువైనా పర్లేదు కానీ తనకంటే ఎక్కువ ఎత్తు ఉండాలంది.   రకుల్ ఉదయాన్నే లేచాక ఎం చేస్తావ్ అని అడగగా....ఫస్ట్ కళ్లు తెరుస్తాను అని చెప్పడంతో.. మంచు లక్ష్మీ అందుకుని.. తరువాత ఏం చేస్తావో నాకు తెలుసు.. ఒకప్పుడు అద్దాల కోసం వెతికేదానివి.. అని చెబుతూ ఉండగా.. ఇప్పుడు లేజర్ ట్రీట్ మెంట్ తీసుకున్నా అవసరం లేదంటూ చెప్పుకొచ్చింది.


 హాట్ వాటర్ తాగుతాను , తరువాత ఘీ టీ అంటూ తన లిస్ట్ చెప్పుకొచ్చింది. ఇలా ముచ్చటిస్తూ షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందిని చెప్పింది. ఒక రొమాంటిక్ సాంగ్ను షూట్ చేస్తున్నపుడు హీరో చెమట దుర్వాసన వల్ల సరిగా యాక్ట్  చేయలేకపోయానని....మధ్యలో వెళ్లి.. తనే పర్ఫ్యూమ్ వేసుకునే దాన్ని.. అక్కడున్న మిగతా వాళ్లు కూడా పర్ఫ్యూమ్ అడిగేవారు అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఆ హీరో పేరు మాత్రం చెప్పలేదు. 


 మన్మథుడు 2 చిత్రంతో పలకరించినా..... ఈ మూవీ అంత విజయం సాధించకపోయే సరికి  తెలుగులో మరో అవకాశం రాలేదు.  రకుల్ ప్రస్తుతం.. మార్జావన్ అనే హిందీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉంది. ఇండస్ట్రీలో ఎవరు అతి దగ్గరి ఫ్రెండ్? ఇలా ఎన్నో విషయాలను సమాధానం చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: