గత సంవత్సరం వరుసగా ఫ్లాపులు వచ్చి బాగా డిసప్పాయింట్ మెంట్ తో ఉన్నాడు యంగ్ హీరో నితిన్. దాంతో నితిన్ సినిమాలకు బాగా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ను కవర్ చేయడానికి వరుసగా 4-5 సినిమాలని ఓకే చేసుకొని లైన్లో పెట్టుకున్నాడు. ఒక వైపు వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భీష్మ' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా కాకుండా కృష్ణచైతన్య దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. వెంకీ అట్లూరితో 'రంగ్ దే' అనే సినిమా రీసెంట్‌గా పూజాకార్యక్రమాలను ఘనంగా జరుపుకుంది. ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. ఇక ఈ సినిమాలతో పాటు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కే మరో సినిమా కూడా క్యూలో ఉందని తెలుస్తోంది. 

డిసెంబర్ లో దాదాపు 5-6 సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అందులో రవి తేజ 'డిస్కో రాజా', సాయి ధరం తేజ్ 'ప్రతి రోజు పండగే', నితిన్ 'భీష్మ' సినిమాలు ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న సినిమాలని చెప్పాలి. అయితే ఈ సినిమాల విడుదలకి ఇంకా రెండు నెలల సమయమే ఉంది. అందుకే రవితేజ తో పాటు, సాయి ధరం తేజ్ కూడా ప్రమోషన్స్ మొదలుపెట్టేసాడు. ఇప్పటికే రెండు సినిమాలకు సంబంధించి ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. ఇక రవి తేజ మరో పది రోజుల్లో 'డిస్కో రాజా' ఫస్ట్ సాంగ్ కూడా విడుదల చేయబోతున్నాడు. అంతేకాదు దీపావళి కి టీజర్ కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.

ఇదే నెలలో రానున్న దీపావళి కి 'ప్రతి రోజు పండగే' టీజర్ కూడా విడుదలయ్యే చాన్స్ ఉందని తాజా సమాచారం. ఆ దిశగా చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలను పక్కన పెడితే 'భీష్మ 'మాత్రం ప్రమోషన్స్ లో వీక్ అనిపించుకుంటుంది. అసలు ఇంతవరకు ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రాలేదు. అందరు దసరా కి ఫస్ట్ లుక్ గాని, టీజర్ గాని రిలీజ్ చేస్తారనుకుంటే కొత్త సినిమా కబురు చెప్పాడు గాని 'భీష్మ' అప్‌డేట్ మాత్రం ఇవ్వలేదు నితిన్. 

నిజానికి క్రిస్మస్ రిలీజ్ అని అనౌన్స్ చేసాక ప్రమోషన్స్ తో 'భీష్మ' ముందుంటాడనుకుంటే బాగా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఈ సినిమా మీద దర్శక, నిర్మాతలకు ఉన్న కాన్ఫిడెన్స్ తో ప్రమోషన్స్ లైట్ తీసుకుంటున్నారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి 'భీష్మ' ప్రమోషన్స్ లో ఇదే రూట్లో వెళ్తే ఓపినింగ్స్ కూడా రావడం కష్టమే. అసలే మన యంగ్ హీరో నితిన్ కి మాంచి హిట్ పడి చాలారోజులైంది. మార్కెట్ కాస్త తగ్గిందని అనుకుంటున్నారు. మళ్ళీ నితిన్ క్రేజ్ పెరగాలంటే భీష్మ ఖచ్చితంగా హిట్ అయి తీరాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: