మెగాస్టార్ చిరంజీవి నటించిన భారతదేశ చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2 వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతూ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ సినిమా చిత్రీకరణ అనుభవాలను పంచుకున్నారు.
 
అయితే ఈ సందర్భంగా ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ శరన్నవరాత్రుల సందర్భంగా ‘సైరా’ సినిమా విడుదల కావడం కాకతాళీయం కాదు దానికి కూడా ఒక దైవీయకమైన విషయం ఉంది. విజయదశమి ఎందుకు చేసుకుంటారో మనందరికీ తెలుసు. సహించడానికి వీల్లేనంతగా ఆగడాలు ఎక్కువైపోయిన దుష్టశక్తిని సంహరించడానికి జగన్మాతకు తొమ్మిది రోజుల సమయం పట్టింది అలాగే అనేక రూపాల అవసరం వచ్చింది. రాక్షసుడైన మహిశాసురుడిని చంపి ఆ దసరా దశమినాడు జగన్మాత సాధించిన విజయం ఎలాంటిదో ఈ సైరా సినిమా సాధించిన విజయం అలాంటిది. ఎక్కడో ఒక పాలెగాడుగా ఉన్న వ్యక్తి తనకు జరిగిన వ్యక్తిగత అవమానాన్ని కాకుండా జాతిమీద జరుగుతున్న అత్యాచారాలుగా భావించి దానికోసం ఒక్కొక్క దివ్వెనూ వెలిగించినట్టుగా "నువ్వే లక్షలై.. ఒకే లక్ష్యమై" అన్నట్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీషువారిని ఎదిరించి పోరాడారు అని అయన తెలిపారు. 


ఇది ఒక చారిత్రాత్మకమైన దైవీయమైన ఘటన కాబట్టి దసరా నవరాత్రుల్లో విడుదలైంది అయన తెలియ చేశారు. ఈ సినిమాకు అఖండమైన విజయం అందించిన చిరంజీవిగారి అభిమానులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాఅని చిరు అభిమానులను పొగిడారు. చిరంజీవి గారు ఆటపాటలతో అలరించడం అన్నది కొత్త విషయం అనేది కాదు. అయితే ఆయనకే సాధ్యమైన రీతిలో ముప్ఫై ఏళ్లుగా అలరిస్తున్నారు.


అది కాకుండా సమాజహితం కోరుకుని రక్తదానం, నేత్రదానం వంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్న వ్యక్తి ఎనిమిది ఏళ్లు గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్లీ తాను ఏం చేయగలరో ఈ సినిమా ద్వారా చిరంజీవిగారు నిరూపించారు అని అన్నారు. చిరంజీవి అంటే డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్ని  ఆయన నుంచి అభిమానులు ఇవే కోరుకుంటారు. కానీ సైరా చిత్రంలో చిరంజీవి సర్కస్ ఫీట్లు లాంటివి ఏమీ ఉండవు. ఆటపాటలతో అలరించే సినిమాలే కాకుండా దేశభక్తిని పెంపొందించే సినిమాలను కూడా తన అభిమానులు ఆదరిస్తారని ఆయన చెప్పిన మాట ఆయన అభిమానుల మీద ఆయనకున్న నమ్మకాన్ని తెలుపుతుంది. ఈ విజయం ఆయన అభిమానుల్లో ఉన్న అభిరుచిని కూడా చాటి చెబుతారని అయన తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: