ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ మెగాస్టార్ చిరంజీవి నటించిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నమరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరక్కేక్కిన సినిమా సైరా. చిరంజీవి కథానాయకుడుగా, నయనతార జోడిగా వచ్చిన ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు కూడా ఇందులో నటించారు. ఆ సినిమా గాంధీ జయంతి సందర్బంగా రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయినా మొదటి రోజే మిశ్రమ టాక్ తో దూసుకుపోతుంది.


ఈ సినిమా బాగుందని కొందరు అనడంతో సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దర్శకుడు సురెనర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అమిత్ త్రివేది ఈ సినిమాకు చక్కటి సంగీతాన్ని సమకూర్చాడు. మూవీ బ్రాండ్ ఫెయిల్ అయినా కూడా లోకల్ మార్కెట్స్‌లో మాత్రం సైరా హవా ఒక్కటే నడుస్తుంది.


ఈ సినిమాను చుసిన తెలంగాణ గవర్నర్ తమిళ సై సినిమా బాగుందని సినిమా పై ప్రశంసల వర్షం కురిపించింది. చాలా చక్కగా తెరకెక్కించారు. దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమా ను చాలా అద్భుతంగా ఉందని పొగడ్తల వర్షం కుండపోతగా కురిపించింది.స్వాతంత్య్ర సమరయోధుడు జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయిందని వెల్లడించింది. 


గవర్నర్ అయితే ఇలాంటి సినిమా చేయడంలో చిరంజీవి తరువాత మరెవరైనా అంటూ అన్నారు. 130 కోట్ల మంది భారతీయులు తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది. ఇది ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే సంబంధించిన కథ మాత్రమే కాదు.. ఇందులో పాండిరాజు (విజయ్ సేతుపతి) పాత్ర ఉండటం ద్వారా తమిళులు ఈ కథలో భాగం అయ్యారు. ఆమెను కలిసేందుకు చిరుతో పాటుగా మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు..


మరింత సమాచారం తెలుసుకోండి: