లోకనాయకుడిగా పేరుగాంచి అద్భుత నటుడు కమల్ హాసన్ గారి ముద్దుల తనయ శృతి హాసన్ ఇప్పటివరకు పలు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి నటిగా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఇక ఇటీవల కొన్నాళ్లుగా మాత్రం శృతికి పెద్దగా సినిమా అవకాశాలు లేవనే చెప్పాలి. అయితే గతంలో ఆమెకు సినిమా కెరీర్ పరంగా కొన్ని మంచి ఆఫర్స్ వచ్చినప్పటికీ, శృతి మాత్రం తన ప్రియుడు మైఖేల్ కోర్సలే ప్రేమలో పడి వాటిని వదులుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అసలు అది నిజమా లేక కాదా అనే విషయం అటుంచితే, 

కొన్నాళ్ల క్రితం మైఖేల్ కూడా శృతితో పూర్తిగా బ్రేకప్ చెప్పినట్లు తన సన్నిహితులతో చెప్పినప్పటికీ, శృతి మాత్రం వారి లవ్ మరియు ఆ తరువాత బ్రేకప్ విషయమై ఇప్పటివరకు మీడియా ముందు మాట్లాడింది లేదనే చెప్పాలి. అయితే తొలిసారి తన మనసులో మాటను ఒక వెబ్ షో ద్వారా బయట పెట్టింది శృతి. వివరాల్లోకి వెళితే, ఒక వెబ్ మీడియా ఛానల్ కోసం మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ఫీట్ అప్ విత్ ది స్టార్స్ అనే టాక్ షో కి ప్రత్యేకంగా హాజరైన శృతి హాసన్, మధ్యలో మాటల సందర్భంలో తన మనసులోని భావాలు, తన ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పడం జరిగింది. 

తాను చూడడానికి పైకి ఎంతో గంభీరంగా ఉన్నప్పటికీ, లోలోపల మాత్రం ఎంతో సున్నిత మనస్కురాలినని, అయితే తనతో స్నేహం చేసిన ప్రతి ఒక్కరు దానిని అలుసుగా తీసుకుని తనపై ఆధిపత్యాన్ని చూపించాలని చూస్తారని, కాబట్టి దానివలననే కొంతమందిని తాను వదులుకోవలసి వచ్చిందని, అవి తన జీవితంలో ఎంతో గుణపాఠాలని ఆమె చెప్పడం జరిగింది. సో దీనిని బట్టి ఆమె ప్రియుడైన మైఖేల్, శృతిపై ఆధిపత్యం చేయడంతో, అది ఆమెకు నచ్చలేదని, అందువల్లనే వారిద్దరిమద్య అభిప్రాయ బేధాలు వచ్చి విడిపోయినట్లు తెలుస్తోంది. కాగా ఈ వార్త ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: