సంచలనాల దర్శకులు రాం గోపాల్ వర్మ ఒక మంచి సినిమా.. అంటే ప్రేక్షకులకు నచ్చే సినిమా వాళ్ళని మెప్పించే సినిమా తీసి ఎంతకాలం అయిందో అంటే కాస్త ఆలోచించి 4..5..6..ఇలా లెక్కపెట్టి ఇన్ని సంవత్సరాలు అని చెప్పాలి. ఇక్కడ మంచి సినిమా అంటే మియా మాల్కోవా 'GST'కాదు...నగార్జున శివ, జె.డి సత్య, అమితాబ్ సర్కార్..ఇలాంటి సినిమాలనమాట. ఇక ప్రస్తుతం ఆర్జీవీ నుంచి అద్భుతమైన సినిమాని ఆశించడం అంటే అది అత్యాసని చెప్పక తప్పదు. టీజర్స్, ట్రైలర్స్ హడావుడి,  వాటితో ట్విట్టర్ లో హడావుడి తప్ప, ఇంకేమీ వుండదు. జనాలకు కూడా ఈ సంగతి బాగా అర్థం అయిపోయింది. ఒకప్పుడు వర్మ కి, వర్మ సినిమాలకి ఉన్న క్రేజ్ ఇప్పుడు ఇసుమంత కూడా లేదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ఆర్జీవీ సినిమా బాక్సాఫీస్ దగ్గర చతికిల పడుతున్నాయి తప్ప ఈ మధ్య కాలంలో హిట్ అయిన సినిమా ఒక్కటి లేదు. 

ఇలాంటి నేపథ్యంలో తనే తీసిన సక్సెస్ ఫుల్ సినిమా రంగీలాకు ట్రిబ్యూట్ అంటూ 'బ్యూటిఫుల్' అనే సినిమాను సైలెంట్ గా తీసేసారు. నిజానికి ఇలా తీసినవి, తీస్తూ ఆపేసినవి వర్మ అకౌంట్ లో చాలానే వున్నాయి. ఇక బ్యూటిఫుల్ సినిమా ట్రైలర్ ను చూస్తుంటే కాస్తంత కొత్తదనం గానీ, సూపర్బ్ అని ఒక్క క్షణం అనిపిస్తే నిజంగా ఇది వర్మ సినిమానే అనుకోవచ్చు. 

వర్మ శిష్యుడు పూరి జగన్నాధ్ తీసిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ ను ఆర్జీవీ చూసి, అందులోని పాటల మాదిరిగా తీసేస్తే సినిమా ఆడేస్తుందనుకున్నారేమోనని ఈ ట్రైలర్ చూసిన వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ట్రైలర్ లో ఆయన తీసిన సినిమా షాట్స్.. ఆయన శిష్యుడు తీసిన సినిమాలోని షాట్స్ తప్ప కొత్తగా ఏమీ కనిపించడం లేదు. 
హీరోయిన్ తో ఎంత చూపించాలో అంతా చూపించారు.. హీరో గెటప్ ఓ చోట చూస్తే షాకీ ష్రాఫ్ ఫస్ట్ సినిమా హీరోలో గెటప్ ను కాపీ కొట్టేసినట్లు తెలిసిపోతోంది.
చూపించాల్సింది అంతా చూపించేసి, ఆపై విరహాలు, ఏడుపులు కలిపేసి, ఏ ఫీలింగ్ లేకుండా కొత్తవాళ్ళు నాసిరకంగా సాదా సీదాగా తీసినట్టు సినిమాని తీసి 'బ్యూటిఫుల్' అంటూ ట్రైలర్ ను వదిలారు. అసలు విషయమే లేని ఇలాంటి సినిమాని తీసే బదులు కనీసం 'GST-2'అయినా తీసుకోవచ్చుగా అన్న భావన కొంతమందిలో కలుగుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: