స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న ఓ భామకు విస్కీ అంటే పిచ్చట. ఆమె కేవలం హీరోయిన్ మాత్రమే కాదు ఓ స్టార్ హీరో తనయురాలు కూడా. సౌత్ లో అతడిని మించిన నటుడు లేనే లేడు అన్న భావన కూడా ఉంది. అలాంటి స్టార్ హీరో కూతురు మాత్రం తనకు విస్కీ అంటే పిచ్చని చెప్పడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది.


ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అనుకుంటా.. అవును మీరు గెస్ చేసింది కరెక్టే.. ఆమె ఎవరో కాదు అందాల భామ శృతి హాసనే. తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫాం లో ఉన్న టైం లో లవ్వు, గివ్వు అంటూ తిరిగిన శృతి హాసన్ అది కాస్త బ్రేకప్ అయ్యే సరికి మళ్లీ తిరిగి సినిమాల మీద దృష్టి పెట్టింది.


ఇక ఈమధ్య మంచు లక్ష్మి చేస్తున్న ఫీట్ అప్ విత్ స్టార్స్ షోలో పాల్గొన్న శృతి హాసన్ తనకు విస్కీ తాగే అలవాటుని బయట పెట్టింది. కేవలం శృతి హాసన్ మాత్రమే కాదు ఈ షోలో పాల్గొన్న స్టార్స్ అంతా తమ సీక్రెట్స్ బయట పెడుతున్నారు. సమంత ఏకంగా చైతు బెడ్ రూం సీక్రెట్ బయట పెట్టింది. రకుల్ ఒక హీరో చెమట కంపుపై కామెంట్స్ చేసింది.


అలానే శృతి హాసన్ తనకు విస్కీ అంటే పిచ్చని.. దాని వల్ల అనారోగ్యం పాలవ్వాల్సి వచ్చిందని ఒప్పుకుంది. అదే కాదు తన డేటింగ్ విషయాన్ని కూడా డేర్ గా ఒప్పేసుకుంది శృతి హాసన్. ఈమధ్య సినిమా అవకాశాలు వచ్చినా కాదని చెప్పిన శృతి హాసన్ మళ్లీ ఇప్పుడు వరుస సినినాలు చేయాలని చూస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో శృతి హాసన్ హీరోయిన్ గా కొన్ని సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయి. మరి చిన్న గ్యాప్ తర్వాత శృతి చేస్తున్న ఈ సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: